నాడు మాట ఇచ్చాడు.. నేడు నిలబెట్టుకున్నాడు!

దేవర సినిమా గ్లింప్స్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది.

దేవర సినిమా గ్లింప్స్‌ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ్లింప్స్‌కు మంచి స్పందన వచ్చింది. ఇక, జూనియర్‌ ఎన్టీఆర్‌ ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది.

ప్యాన్‌ ఇండియా స్టార్‌ హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌- దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో ‘దేవర’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి తాజాగా ఫస్ట్‌ గ్లింప్స్‌ విడుదల అయింది. ఈ గ్లింప్స్‌కు భారీ స్పందన వచ్చింది. గ్లింప్స్‌లోని ప్రతీ సీన్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో ఉందంటూ జూనియర్‌ ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడు ప్రశంసలు కురిపించారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ యాక్టింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. గ్లింప్స్‌ చివరలో ఆయన చెప్పే సముద్రం డైలాగ్‌ తెగ వైరల్‌ అవుతూ ఉంది.

ఇక, ఈ మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. గ్లింప్స్‌ అన్ని భాషల్లోనూ విడుదల అయింది. అన్ని భాషల్లో మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక, ఈ నేపథ్యంలోనే జూనియర్‌ ఎ‍న్టీఆర్‌ ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది. మలయాళ అభిమానులకు ఇచ్చిన మాట నెరవేర్చటం ద్వారా ఆయనకు ఈ రికార్డు దక్కింది. ఇంతకీ సంగతేంటంటే..  ఆర్‌ఆర్‌ఆర్‌కు తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో జూనియరే డబ్బింగ్‌ చెప్పారు.

మలయాళంలో చెప్పలేకపోయారు. చిత్ర ప్రమోషన్ల కోసం జూనియర్‌ కేరళ వెళ్లారు. అక్కడి అభిమానులతో మాట్లాడుతూ.. మలయాళ భాషలో డబ్బింగ్‌ చెప్పలేకపోయినందుకు బాధపడ్డారు. తన తర్వాతి చిత్రానికి మలయాళంలో తప్పకుండా డబ్బింగ్‌ చెబుతానని అన్నారు. అప్పుడు ఇచ్చిన మాటను ఆయన ఇప్పుడు నిలబెట్టుకున్నారు. దేవర మలయాళ గ్లింప్స్‌కు స్వయంగా జూనియర్‌ ఎన్టీఆరే డబ్బింగ్‌ చెప్పారు. ఇలా, మలయాళ భాషలో డబ్బింగ్‌ చెప్పిన మొదటి టాలీవుడ్‌ హీరోగా రికార్డు కెక్కారు.

కాగా, దేవరలో జూనియర్‌ ఎన్టీఆర్‌కు సరసన జాన్వీ కపూర్‌ నటిస్తున్నారు. తంగం అనే పాత్రలో కనిపించనున్నారు. విలన్‌గా సైఫ్‌ ఆలీ ఖాన్‌ నటిస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా చిత్ర షూటింగ్‌ అయిపోయింది. తాజాగా, హీరో, విలన్‌ మధ్య యాక్షన్‌ సీన్లు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటి భాగం ఏప్రిల్‌ 5వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరి, డబ్బింగ్‌ విషయంలో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఇచ్చిన మాట నిలబెట్టుకోవటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments