Pavithra: ప్రేమికుల దినోత్సవం నాడే ప్రియుడికి బ్రేకప్‌ చెప్పిన జబర్దస్త్‌ పవిత్ర

ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమలో పడుతుంటే.. జబర్దస్‌ పవిత్ర మాత్రం బ్రేకప్‌ వార్త చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

ప్రేమికుల దినోత్సవం నాడు ప్రేమలో పడుతుంటే.. జబర్దస్‌ పవిత్ర మాత్రం బ్రేకప్‌ వార్త చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు..

జబర్దస్త్‌ పవిత్ర గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. లేడీ కమెడియన్‌గా.. జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యింది పవిత్ర. మంచి కామెడీ టైమింగ్‌తో.. లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. సోషల్‌ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది పవిత్ర. ఆమెకు యూట్యూబ్‌ చానెల్‌ కూడా ఉంది. వీడియోలు అప్లోడ్‌ చేస్తూ సందడి చేస్తుంటుంది పవిత్ర. తాజాగా ఓ షాకింగ్‌ న్యూస్‌  చెప్పింది పవిత్ర. లవర్స్‌ డే నాడు.. కొందరు కొత్తగా ప్రేమలో పడితే.. ఆల్రేడీ లవ్‌లో ఉన్నవారు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ పవిత్ర మాత్రం బ్రేకప్‌ న్యూస్‌ చెప్పి అందరికి షాక్‌ ఇచ్చింది. ఎందుకు.. ఏం జరిగింది అంటే..

జబర్దస్త్‌ కార్యక్రమం ద్వారా లేడీ కమెడియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర.. కొన్ని రోజుల క్రితం తాను ప్రేమించిన సంతోష్‌ అనే వ్యక్తితో ఉంగరాలు కూడా మార్చుకుంది. అందరూ వీళ్లిద్దరూ నిశ్చితార్థం చేసుకున్నారనే అనుకున్నారు. త్వరలోనే వీళ్లద్దరూ పెళ్లి చేసుకుంటారని భావిస్తుండగా.. పవిత్ర మాత్రం ఊహించని షాక్‌ ఇచ్చింది. మూడు ముళ్ల బంధంలోకి అడుగు పెట్టబోతుంది అనుకుంటే ఎవరూ ఊహించని విధంగా వాలెంటైన్స్‌ డే రోజునే తన ప్రియుడికి బ్రేకప్‌ చెప్పేసి అందరికీ షాకిచ్చింది పవిత్ర. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది పవిత్ర.

ఈ సందర్భంగా పవిత్ర.. ‘‘మా శ్రేయోభిలాషులందరికీ ఈ సందర్బంగా ఒక విషయం తెలియచేస్తున్నాను. నేను సంతోష్‌ విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇద్దరి పరస్పర అంగీకారం ద్వారా ఈ విషయం వెల్లడిస్తున్నాను. మా మార్గాలు వేరుగా ఉన్నా.. మేము పంచుకున్న క్షణాలు చాలా ప్రత్యేకం. భవిష్యత్తులో, మా వ్యక్తిగత ప్రయాణంలో ఇద్దరికీ మంచి జరగాలని కోరుకుంటున్నా. ఈ కష్ట సమయంలో మాకు మద్దతుతో పాటు ప్రైవసీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. జీవితంలో ముందుకు సాగేందుకు మీ ప్రేమ, మద్దతు ఉంటుంది అని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు’’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది పవిత్ర.

సంతోష్‌తో ప్రేమలో ఉన్న సమయంలో పవిత్ర అతడి గురించి చాలా గొప్పగా చెప్పుకొచ్చింది. ‘‘నా ప్రేమ కోసం ఏడాది నుంచి ఎదురు చూశావ్‌. ఇక నా చివరి శ్వాస వరకు నీ చేయి వదలను. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇద్దరం కలిసి వాటిని ఎదుర్కొందాం’’ అంటూ చాలా గొప్పగా చెప్పుకొచ్చింది పవిత్ర. ఎన్ని కష్టాలు వచ్చినా విడిపోవద్దు అని చెప్పి.. ఇప్పుడిలా బ్రేకప్‌ చెప్పుకోవడం ఆమె ఫ్యాన్స్‌ని నిరాశపరిచింది.

సంతోష్‌, పవిత్ర ఇద్దరూ విడిపోవడంతో వారిని అభిమానించే వారు విచారం వ్యక్తం చేస్తున్నారు. కారణాలు ఏమైనా కానీ.. ఇలాంటి సమయంలో ఇద్దరూ ధైర్యంగా ఉండాలని వారి అభిమానులు ఆశిస్తున్నారు. గతాన్ని వదిలేసి భవిష్యత్తు వైపు అడుగు వేయాలని కామెంట్ల రూపంలో మద్దతు తెలుపుతున్నారు నెటిజనులు.

Show comments