ఆంధ్రా అంధుడిపై బాలీవుడ్ సినిమా..ఎవరీ శ్రీకాంత్ బొల్లా..?

Srikanth Bolla Biopic Movie: ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ అంధుడిపై మూవీ తెరకెక్కించారు.

Srikanth Bolla Biopic Movie: ఇటీవల సినీ ఇండస్ట్రీలో ఎన్నో బయోపిక్ చిత్రాలు తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఏపీకి చెందిన ఓ అంధుడిపై మూవీ తెరకెక్కించారు.

ప్రస్తుతం చిత్ర పరిశ్రమంలో బయోపిక్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లో అద్భుత విజయాలు సాధించిన ప్రముఖుల జీవితాన్ని ఆధారంగా చేసుకొని బయోపిక్ చిత్రాలు తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శ్రీకాంత్ బొల్లా జీవితాన్ని ఆధారంగా చేసుకొని బాలీవుడ్ లో ఓ మూవీ రూపొందించారు. రాజ్ కుమార్ రాజ్ హీరోగా నటించిన ‘శ్రీకాంత్’ మూవీ నుంచి తాజాగా టీజర్ కూడా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి తుషార్ హీరా నందిని దర్శకత్వం వహించారు. హీరోయిన్ గా జ్యోతిక, ఆలయ ఎఫ్ లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ మే 10న రిలీజ్ కాబోతుంది. అసలు ఏపీకి చెందిన శ్రీకాంత్ బొల్లా ఎవరు అన్న విషయంపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే..

కృష్ణా జిల్లా మచిలీపట్నం శివార్లోని సీతారాంపురం గ్రామంలో 1992, జులై 7న జన్మించాడు.  వ్యవసాయ కుటుంబానికి చెందిన శ్రీకాంత్ పుట్టుకతోనే అంధుడు. శ్రీకాంత్ పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులతో కొంతమంది బంధువుల, స్థానికులు ఈ బాబుతో ముందు ముందు కష్టాలు ఉంటాయి.. వదిలించుకోవడం మంచిదని సలహా ఇచ్చారట. కానీ శ్రీకాంత్ తల్లిదండ్రులు ఆవేవీ పట్టించుకోకుండా తమ కొడుకు కోసం ఎన్నో కష్టాలు పడ్డారు. కంటి చూపు లేకున్నా.. తన లోపాన్ని ఛాలెంజ్ గా తీసుకొని శ్రీకాంత్ బొల్లా పట్టుదలతో ఉన్నతవిద్యనభ్యసించి అమెరికాలోని ఎంఐటీ నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన తొలి అంతర్జాతీయ అంద విద్యార్థిగా రికార్డు క్రియేట్ చేశాడు. చిన్నప్పటి నుంచి చదువుల్లో ఎంతో చురుకుగా ఉండేవాడు శ్రీకాంత్. టెన్త్ లో మంచి మార్కులు సాధించిన తర్వాత ఇంటర్లో సైన్స్ సబ్జెక్ట్ తీసుకోవాలని భావించాడు.  కానీ కానీ కొన్ని రూల్స్ వర్తించవని సైన్స్ సబ్జెక్ట్ కి సంబంధించి అడ్మీషన్ లభించలేదు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించిన శ్రీకాంత్ తర్వాత సైన్స్ సబ్జెక్ట్ చదివేందుకు కోర్టు నుంచి అనుమతి పొందాడు.

తాను ఎంతో ఆశంతో కాలేజ్ లో చేరితే.. అక్కడ విద్యార్థుల అవహేళన భరించలేకపోయాడు. దీంతో రెండేళ్ల పాటు ఇంటికే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ దివ్యాంగుల స్కూల్ లో చేరాడు. అక్కడ కూడా అవమానాలు ఎదురయ్యాయి.. దీంతో ఇంటికి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ టీచర్ అతన్ని ఆపి ధైర్యం చెప్పాడు. ఆడియో టేపుల్లో పాఠాలు విని ఎంపీసీలో 98 శాతం మార్క్ లతో టాపర్ గా నిలిచాడు. ఆ తర్వాత ఐఐటీ చదవాలనుకున్న అంధుడు కావడంతో మళ్లీ అదే సమస్య ఎదురైంది. ప్రస్తుతం శ్రీకాంత్ బొల్లా పారిశ్రామిక వేత్తగా సక్సెస్ ఫుల్ గా లైఫ్ గడుపుతున్నాడు. ప్రస్తుతం హైదరాబాద్ లో 2012 లో బొల్లాంట్ ఇండస్ట్రీస్ అనే సంస్థను స్థాపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచాడు. ఈ సంస్థకు రతన్ టాటా కూడా ఫండింగ్ చేసి ఆదుకున్నాడు. ఇది మొక్కల ఆధారంగా కంపెనీ ప్రొడెక్ట్స్ తయారు చేసే కంపెనీ.

ప్రముఖ మ్యాగజిన్ ఫోర్స్ 2017 లో ప్రచురించిన ఆసియాలోని 30 ఏళ్ల లోపు 30 మంది అంటూ ప్రచురించిన జాబితాలో శ్రీకాంత్ కి చోటు దక్కడం ఆయన కృషీ, పట్టుదలకు నిదర్శనం. 2022 లో స్వాతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు.. ఇటీవల ఈ జంట తల్లిదండ్రులయ్యారు. అమెరికాలో ఎన్నో కార్పోరేట్ సంస్థలు శ్రీకాంత్ కి పిలిచి గొప్ప గొప్ప ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా.. తన జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడే ఉండి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. శ్రీకాంత్ స్థాపించిన కంపెనీలో వేల మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు.. వేల మందికి ఆయన సొంత ఖర్చులతో చదివిస్తున్నారు.

Show comments