Dharani
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు భారీ షాక్ తగిలింది. ఏడాది జైలు శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. ఆవివరాలు..
Bandla Ganesh: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌కు భారీ షాక్ తగిలింది. ఏడాది జైలు శిక్ష విధించింది ఒంగోలు కోర్టు. ఆవివరాలు..
Dharani
సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్‌కు భారీ షాక్ తగిలింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది. ఒంగోలు కోర్టు బుధవారం నాడు ఈ తీర్పు వెల్లడించింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టుకి హాజరైన సినీ నిర్మాత బండ్ల గణేష్. ఈ కేసును విచారించిన సెకండ్ ఏఎంఎం కోర్టు.. నిర్మాత బండ్ల గణేష్‌కు ఒక సంవత్సరం జైలు శిక్ష, 95 లక్షలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. అంతేకాక ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు గాను బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు ఇచ్చింది.
నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర 2019లో బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి అసలు, వడ్డీతో కలిపి 1 కోటి 20 లక్షల రూపాయలకు గాను జెట్టి వెంకటేశ్వర్లుకు చెక్ ఇచ్చాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో ఈ చెక్ ఇచ్చాడు. అయితే అది బౌన్స్ కావడంతో 2019లో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. వెంకటేశ్వర్లు ఫిర్యాదును స్వీకరించిన కోర్టు విచారణ చేపట్టింది. నేడు తాజాగా బండ్ల గణేష్‌కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది.
గతంలో ఈ కేసుకు విచారణకు హాజరుకావాలని కోర్టు గణేష్‌కు పలుసార్లు నోటీసులు ఇచ్చింది. అయితే ఆయన ఒక్కసారి కూడా కోర్టుకు రాలేదు. దీంతో గతంలో కోర్టు బండ్ల గణేష్ మీద అరెస్టు వారెంటు కూడా జారీచేసింది. ఈక్రమంలో ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లారు.
గతంలో కూడా చెక్ బౌన్స్ కేసులో కోర్టు బండ్ల గణేష్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2017లో టెంపర్ సినిమాకు సంబంధించి డైరెక్టర్ వక్కంతం వంశీ కేసిన చెక్‌బౌన్స్ కేసులో భాగంగా బండ్ల గణేష్‌కు ఎర్రమంజిల్ కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు 15,86,550 రూపాయల జరిమానా కూడా విధించింది. 25 లక్షల రూపాయలకు సంబంధించిన చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేశ్‌కు కోర్ట్ ఈ శిక్ష విధించింది. కానీ వెంటనే బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా.. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌మంజూరు చేసింది.
చిన్న చిన్న పాత్రలతో నటుడిగా కెరీర్ ప్రారంభించిన బండ్ల గణేష్.. ఆ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కిన ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారాడు. తరువాత వరుసగా పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కూడా చురుగ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న బండ్ల గణేష్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని ప్రకటించడమే కాక ఎంపీ టికెట్ కోసం దరఖాస్తు కూడా చేసుకున్నాడు.