Tollywood Continuing Dominance On Bollywood: 2024లోనూ టాలీవుడ్ డామినేషన్ తప్పదా? అంతా మనదే!

2024లోనూ టాలీవుడ్ డామినేషన్ తప్పదా? అంతా మనదే!

Tollywood Dominance On Bollywood In 2024: ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే పేరు నుంచి టాలీవుడ్ వైపు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదిగాం.

Tollywood Dominance On Bollywood In 2024: ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే పేరు నుంచి టాలీవుడ్ వైపు చూసే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఇండియన్ మూవీ అంటే తెలుగు సినిమా అనే స్థాయికి ఎదిగాం.

దేశవ్యాప్తంగా సినిమాకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఏ చిన్న హ్యామీ మూమెంట్ ఉన్నా మూవీతో సెలబ్రేట్ చేసుకుంటారు. అందుకే ఇండియాలో సినిమా అంటే అది కేవలం ఆర్ట్ మాత్రమే కాదు.. అది ప్రేక్షకుల ఎమోషన్ అనే చెప్పాలి. అలాంటి సినిమా విషయంలో సౌత్- నార్త్, టాలీవుడ్- బాలీవుడ్ అనే బేధాలు, భిన్నాభిప్రాయాలు, డామినేషన్ ఉండేది. గతంలో అయితే ఇండియన్ సినిమా అంటేనే బాలీవుడ్ అనేలా ఉండేది. కానీ, ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే టాలీవుడ్ అనే పరిస్థితి వచ్చేసింది. ఏ క్రాఫ్ట్ చూసినా కూడా సౌత్ డామినేషన్ ఎక్కువగా ఉంది. మరీ ముఖ్యంగా.. టాలీవుడ్ ఆధిపత్యాన్ని బీ టౌన్ పెద్దలు జీర్ణించుకోలేకపోతున్నారు. పైకి చెప్పుకోలేక మన సినిమాలకు మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టలేక మదనపడిపోతున్నారు. అయితే ఈ ఏడాది కూడా వారికి అలాంటి పరిస్థితి తప్పేలా లేదు. ఎందుకంటే 2024 కూడా ఇండియన్ సినిమాలో టాలీవుడ్ డామినేషన్ తప్పేలా లేదు.

సాధారణంగా పాన్ ఇండియా సినిమాల హవా మొదలయ్యాక బాలీవుడ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. కలెక్షన్స్ కొట్టాలన్నా, రికార్డులు బద్దలు కాట్టాలన్నా అది టాలీవుడ్ డైరెక్టర్స్, హీరోలతోనే సాధ్యం అయ్యింది. గత రెండేళ్లుగా వారి పరిస్థితి అలాగే ఉండిపోయింది. 2023లో మాత్రం పఠాన్, జవాన్, గదర్ 2, ఆదిపురుష్ సినిమాలు కోట్ల వర్షం కురిపించినా కూడా అందులో ఒక సినిమాలో టాలీవుడ్ హీరో, ఇంకో సినిమా డైరెక్టర్ సౌత్ వాడే ఉన్నాడు. అలా కూడా వారికి పూర్తి ఆనందం దక్కలేదు. ఇప్పుడు ఇదే సీన్ 2024లో కూడా రిపీట్ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి అందకు మించే వారికి షాకులు తగిలే సినిమాలు టాలీవుడ్ నుంచి ఈ ఏడాది కోసం క్యూ కడుతున్నాయి. ఎందుకంటే రాబోయే చిత్రాలు దాదాపుగా పాన్ ఇండియా సినిమాలే ఉన్నాయి. అది కూడా సూపర్ డూపర్ కాన్సెప్ట్ తో వస్తున్నాయి.

ఈ ఏడాది వచ్చే మూవీస్ లో సీక్వెల్స్ కూడా ఉన్నాయి. వాటిలో పుష్ప 2 మూవీకి వరల్డ్ వైడ్ గా ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఇప్పటికీ “మే జుకేగా నహీ, పుష్ప భోలేతో ఫ్లవర్ సమ్జే క్యా? ఫైర్ హూ మే” అంటూ డైలాగులు చెప్పేస్తున్నారు. అలాంటి సినిమాకి సీక్వెల్ అంటే థియేటర్లలో మాస్ జాతర నెలకొంటుందనే చెప్పాలి. ఇంక అడవి శేషు నటించిన గూఢచారి సినిమాకి సీక్వెల్ గా గూఢచారి 2 మూవీ ఈ ఏడాదిలోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఆ మూవీకి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంక పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న సైన్స్ ఫిక్షన్ ‘కల్కీ 2898 ఏడీ’ కూడా ఈ ఏడాది విడుదల అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ ఒక్క పాన్ ఇండియా లెవల్లోనే కాదు.. పాన్ వరల్డ్ స్థాయిలో ఎన్నో రికార్డులు బద్దలు కొడుతుందని ట్రేడ్ పండితులు ఇప్పటి నుంచి అంచనాలు వేస్తున్నారు.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్- శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా కూడా ఈ ఏడాది సెప్టెంబర్ లో విడుదల అయ్యే ఛాన్స్ ఉందని నిర్మాత దిల్ రాజు చెప్పకనే చెప్పారు. ట్రిపులార్ తర్వాత రామ్ చరణ్ కు బాలీవుడ్ లో మార్కెట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి గేమ్ ఛేంజర్ సినిమాకి కచ్చితంగా చాలా మంచి బిజినెస్ జరుగుతుంది. పవన్ కల్యాణ్- సుజీత్ కాంబోలో వస్తున్న OG సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే సుజీత్ నిర్మించిన సాహో చిత్రానికి బాలీవుడ్ ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. అంతేకాకుండా ఇప్పటికే ఓజీ గ్లింప్స్ కి నార్త్ ఆడియన్స్ పిచ్చెక్కిపోయున్నారు. ఇంక జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వస్తున్న దేవర పార్ట్ 1 కోసం అయితే ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. హిందీ ఆడియన్స్ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ కి ఉన్న మార్కెట్ ఒక కారణం అయితే.. ఆ మూవీలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు కారణాలతో బాలీవుడ్ లో దేవర సినిమాకి ఎతో మంచి మార్కెట్ ఏర్పడుతుందని చెబుతున్నారు.

అంతేకాకుండా కార్తికేయ 2తో పాన్ ఇండియన్ హీరోగా మారిపోయిన నిఖిల్ ‘స్వయంభు’ అనే హిస్టారికల్ పాయింట్ తో వస్తున్నాడు. నిఖిల్ కు నార్త్ లో మంచి మార్కెట్ క్రియేట్ అయ్యింది. ఈ నేపథ్యంలోనే స్వయంభుపై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ లెక్కన చూసుకుంటే పాన్ ఇండియన్ లెవల్లో టాలీవుడ్ ఈ ఏడాది కూడా బాక్సాఫీస్ ని బద్దలు కొడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇవి మాత్రమే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి నుంచి విజువల్ వండర్ గా వస్తున్న ‘విశ్వంభర’పై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇవి మాత్రమే కాకుండా బాలయ్య 109, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్, టిల్లు స్క్వేర్, నానీ మూవీ సరిపోతుందా శనివారం వంటి చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాయి. మరి.. బాలీవుడ్ పై ఈ ఏడాది కూడా టాలీవుడ్ ఆధిపత్యం కొనసాగుతుందని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments