సలార్ సంక్రాంతిని టార్గెట్ చేస్తే.. పరిస్థితి ఏంటి?

  • Author ajaykrishna Published - 11:09 AM, Wed - 20 September 23
  • Author ajaykrishna Published - 11:09 AM, Wed - 20 September 23
సలార్ సంక్రాంతిని టార్గెట్ చేస్తే.. పరిస్థితి ఏంటి?

ఒక్కోసారి ఇండస్ట్రీలో ఒకేసారి పాన్ ఇండియా సినిమాలు థియేటర్స్ లో పోటీ పడితే ఎలా ఉంటుందో చూడాలని అందరికీ అనిపిస్తుంది. ఎందుకంటే.. సినిమాలన్నాక వేరే సినిమాలతో పోల్చుతూ చూస్తుంటారు. సినిమా రిలీజ్ ముందు బజ్ నుండి రిలీజ్ అయ్యాక ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు ఫ్యాన్స్ కన్సిడర్ చేస్తుంటారు. కానీ.. ఒకేసారి రెండు పెద్ద సినిమాలు బరిలో దిగితే థియేటర్స్ కొరత ఏర్పడుతుందని.. ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా గండీ పడుతుందని ఏవేవో కారణాల చేత ఒక్కసారి రిలీజ్ అనేది పక్కన పెట్టేస్తుంటారు. ప్రస్తుతం టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ మధ్య అలాంటి వాతావరణమే కనిపిస్తుంది.

ఇండస్ట్రీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సలార్ క్రేజ్ ఎలా ఉందో తెలిసిందే. సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన ఆ సినిమా ప్రస్తుతం వాయిదా పడింది. నెక్స్ట్ రిలీజ్ డేట్ ఏంటనేది ఇంకా మేకర్స్ కన్ఫర్మ్ చేయలేదు. కానీ.. సలార్ రిలీజ్ గురించి ఇండస్ట్రీ వర్గాలలో కొన్ని రూమర్స్ గట్టిగా వైరల్ అవుతున్నాయి. అదేంటంటే.. సలార్ మూవీ నవంబర్ లో రిలీజ్ అవుతుందని కొన్ని కథనాలు ట్రెండ్ అవుతుంటే.. మరోవైపు సలార్ సంక్రాంతికి వెళ్తుందేమో అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. సలార్ కి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ లో ఏదో పెండింగ్ ఉందని, బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ట్రై చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.

ఈ లెక్కన సలార్ నవంబర్ లో వస్తే బాగానే ఉంటుంది. కానీ.. పొరపాటున సంక్రాంతికి వాయిదా పడిందంటే మాత్రం అక్కడ పెద్ద వార్ జరిగే అవకాశం ఉంది. లేదా సలార్ ఇంపాక్ట్ చూసి వేరే సినిమాలు తప్పుకునే అవకాశం లేకపోలేదు. సంక్రాంతికి మహేష్ బాబు గుంటూరు కారం ఫిక్స్ అయ్యింది. పాన్ ఇండియా మూవీ హనుమాన్ కూడా లాక్ చేసుకున్నారు. మరోవైపు ప్రతినిధి 2 కూడా అనుకుంటున్నారు. వీటితో పాటు నా సామిరంగా కూడా ఉంది. మరి సలార్ వస్తే.. ఏయే సినిమాలు పోటీగా నిలబడతాయో తెలియదు. కానీ.. దాదాపు వాయిదా పడే అవకాశాలు ఎక్కువని టాక్ నడుస్తుంది. ఇవన్నీ తెలియాలంటే సలార్ ఎప్పుడు వస్తుందనేది మేకర్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరి సలార్ వస్తే ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Show comments