Venkateswarlu
హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన విడుదల విడుదల కానుంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వనుంది.
హనుమాన్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 12వ తేదీన విడుదల విడుదల కానుంది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అవ్వనుంది.
Venkateswarlu
మరికొన్ని గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా హనుమాన్ స్పెషల్ షోలు మొదలవ్వనున్నాయి. సాయంత్రం 6.15 గంటలకు ఓ షో.. 9.30 గంటలకు మరో షో ఉండనుంది. అయితే, కొంతమంది ప్రముఖులకు ఇప్పటికే షోలు వేసి సినిమా చూపించారు. హిందీ వర్షన్ సినిమా చూసిన ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్స్ హనుమాన్ ఎలా ఉందో చెప్పారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో హనుమాన్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు.
నటన, దర్శకత్వం మరీ ముఖ్యంగా వీఎఫ్‌ఎక్స్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. మొత్తానికి మూడున్నర రేటింగ్ ఇచ్చారు. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇలాంటి ఈ సమయంలో హనుమాన్ నుంచి వచ్చిన ఓ అప్‌డేట్ ప్రేక్షకుల్లో ఆత్రుతను మరింత పెంచేస్తోంది. బహుబలి మొదటి భాగం విడుదల అయిన తర్వాత రెండో భాగం కోసం క్లైమాక్స్‌లో ట్విస్ట్ పెట్టారు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అంటూ ఓ ప్రశ్నను ప్రేక్షకుల మెదుళ్లలోకి జొప్పించారు.
ఇప్పుడు హనుమాన్ విషయంలోనూ ఇదే జరుగుతోంది. బహుబలి లాగే హనుమాన్‌లో ఓ క్లైమాక్స్ ట్విస్ట్ ఉండనుందట. రాముడికి..హనుమంతుడు ఓ మాట ఇచ్చి ఉంటాడట. ఆ మాట ఏంటో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. హనుమాన్ మూవీకి సీక్వెల్‌పై హైప్ పెంచడానికి ‘ రాముడికి..హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న ప్రశ్నను దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రేక్షకుల మెదుళ్లలో వేసేశారు. ఈ మాట ఏంటో తెలియాలంటే పార్ట్ 2 చూడాల్సిందే.
కాగా, హనుమాన్ సినిమాలో తేజ సజ్జా హీరోగా నటించారు. తేజ సజ్జాకు జంటగా.. అమృత అయ్యర్ నటించారు. వరలక్ష్మీ శరత్ కుమార్, వినయ్ రాయ్, వెన్నెల కిశోర్, గెటప్ సీను, సత్య తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. జనవరి 12వ తేదీన తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక, ప్రీ బుకింగ్స్ విషయంలో హనుమాన్ సినిమా తన సత్తా చాటింది. స్టార్ హీరోల సినిమాతో పోటీ పడింది.
టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. భారత్‌తో పాటు ఓవర్‌సీస్‌లోనూ అద్భుతమైన బుకింగ్స్ జరిగాయి. మరి, హనుమాన్ సినిమాలోని ‘ రాముడికి..హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న ట్విస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.