Dharani
Hanuman Team Donat-Ayodhya Ram Mandir: ఇచ్చిన మాట మీద నిలబడ్డారు హనుమాన్ టీం. అయోధ్య మందిరానికి భారీ విరాళం ఇచ్చారు. ఆ వివరాలు..
Hanuman Team Donat-Ayodhya Ram Mandir: ఇచ్చిన మాట మీద నిలబడ్డారు హనుమాన్ టీం. అయోధ్య మందిరానికి భారీ విరాళం ఇచ్చారు. ఆ వివరాలు..
Dharani
ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా, అమృతా అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలైన ఈ సినిమా మన దేశంలోనే కాక విదేశాల్లో సైతం రికార్డు స్థాయిలో కలెక్షన్లు కలెక్ట్ చేస్తోంది. సినిమా విడుదలై వారంపైనే అవుతోంది.. ఇప్పటికి కూడా థియేటర్ల వద్ద హౌజ్‌ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇక విదేశాల్లో ఇప్పటికే 5 మిలియన్ల క్లబ్‌లో చేరగా.. మన దగ్గర 150 కోట్ల గ్రాస్ కొల్లగొట్టిందని ప్రకటించారు. అయితే హనుమాన్ సినిమా విడుదల సందర్భంగా.. ఈ సినిమాకు తెగే ప్రతి టికెట్ మీద 5 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళం ఇస్తామని చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇచ్చిన మాట నిలబెట్టుకుంది హనుమాన్ టీమ్. ఇప్పటి వరకు హనుమాన్ సినిమాకు అమ్ముడైన టికెట్ల మీద రూ.5 చొప్పున సుమారు 2 కోట్ల 66 లక్షల 41 వేల 055 రూపాయలు అయోధ్య రామ మందిరానికి విరాళంగా ఇచ్చామని హనుమాన్ టీమ్ ట్విట్టర్ వేదికగా ప్రకటించింది. ఇప్పటి వరకు ఈసినిమాకు 53,28,211 టికెట్లు అమ్ముడయ్యాని.. ఒక్కో టికెట్ మీద రూ.5 చొప్పున.. మొత్తం 2,66,41,055 కోట్ల రూపాయలు అయోధ్య రామ మందిర ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చామని ప్రకటించారు. ఇక హనుమాన్ సినిమాకు టికెట్లు ఏ రేంజ్‌లో అమ్ముడవుతున్నాయో బుక్ మై షో చూస్తే అర్థం అవుతుంది.
ప్రస్తుతం కాలంలో ఒక సినిమా కనీసం పది థియేటర్లలో కూడా హౌజ్ ఫుల్ అవ్వడం కష్టంగా ఉండగా.. హనుమాన్ సినిమాకు మాత్రం ఇప్పటికి కూడా టికెట్లు దొరకడం లేదని అంటున్నారు జనాలు. నైజాం ఏరియాలో అయితే హనుమాన్ సినిమాకు డిమాండ్‌కు తగ్గ స్థాయిలో థియేటర్లు లభించలేదు. దాంతో ఈ సినిమా విడుదలైన ప్రతీ థియేటర్ జనాలతో కిక్కిరిసిపోతోంది. మరో వారం రోజుల పాటు హనుమాన్ సినిమా ఇదే స్థాయిలో కలెక్షన్లు సాధిస్తుంది అంటున్నారు ఇండస్ట్రీ నిపుణులు.
ఇక వచ్చే వారం రిపబ్లిక్ డే సందర్భంగా పెద్ద చిత్రాలు బరిలోకి దిగబోతోన్నాయి. బాలీవుడ్‌లో హృతిక్ రోషణ్ ఫైటర్ రాబోతోంది. తెలుగులో అయలాన్, కెప్టెన్ మిల్లర్ డబ్బింగ్ వర్షెన్స్ రాబోతోన్నాయి. వీటి ధాటికి హనుమాన్ తట్టుకుని నిలబడితే మరింతగా రికార్డులు క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది అంటున్నారు.
#HANUMAN for SHREE RAM ✨
As announced, Team HanuMan is going to donate a grand sum of ₹2,66,41,055 for 53,28,211 tickets sold so far for Ayodhya Ram Mandir 🤩🙏
A @PrasanthVarma film
🌟ing @tejasajja123#HanuManForShreeRam #HanuManEverywhere… pic.twitter.com/bFA3VPqvKo— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) January 21, 2024