Thankamani: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళ రివెంజ్ డ్రామా

Thankamani: ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ మలయాళ రివెంజ్ డ్రామా

మలయాళ సీనియర్ హీరో దీలిప్ ప్రధాన పాత్రలో నటించగా రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా.కాగా ఉడాల్ ఫేమ్ రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించారు.

మలయాళ సీనియర్ హీరో దీలిప్ ప్రధాన పాత్రలో నటించగా రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా.కాగా ఉడాల్ ఫేమ్ రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించారు.

మలయాళ సీనియర్ హీరో దీలిప్ ప్రధాన పాత్రలో నటించగా రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన సినిమా థంకమణి. తాజాగా థంకమణి నిర్మాతలు సినిమా డిజిటల్ రిలీజ్ గురించిన అప్‌డేట్‌ను ఇచ్చారు. ఈ సినిమా తాలూకు డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సైనా ప్లే ప్లాట్ ఫారమ్ చేజిక్కించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఓటీటీలో ఖచ్చితంగా ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పటికీ చెప్పలేదు.

సాధారణంగా 40 రోజుల థియేట్రికల్ రన్ తర్వాత ఒటీటీలో సినిమాలను విడుదల చేసే ప్రస్తుత ట్రెండ్‌ను అనుసరించి ఏప్రిల్ మొదటి లేదా రెండవ వారంలో థంకమణి విడుదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఈ గ్రిప్పింగ్ రివెంజ్ థ్రిల్లర్‌లో ప్రధాన పాత్రను సీనియర్ హీరో దిలీప్ పోషించారు. కాగా ఉడాల్ ఫేమ్ రతీష్ రఘునందన్ దర్శకత్వం వహించారు. ప్రణీత సుభాష్, నీతా పిళ్లై కథానాయికలుగా కనిపించారు. నిజానికి ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ ఆలస్యమై దిలీప్ అభిమానులను కలవరపెట్టింది. టీజర్‌లో దిలీప్‌కి క్యారెక్టర్ కు సంభందించిన ఆర్క్ రివీల్ అవడంతో ప్రేక్షకులు ఈ సినిమా పై ఆసక్తి పెంచుకున్నారు. అయితే మార్చి 7న థియేటర్లలో విడుదలైన థంకమణి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంతే కాకుండా హీరో దిలీప్‌కి ఎంతో అవసరమైన కమ్ బ్యాక్ ను అందించలేకపోయింది.

రాజకీయ నాయకులను, మాజీ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులను దారుణంగా హతమార్చిన ఒక సీరియల్ కిల్లర్ కోసం వెతికే కథతో ఈ సినిమా తెరకెక్కింది. ఐపీఎస్ అధికారిణి అర్పిత నాథ్ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న కొద్దీ ఆమెకి ఎన్నో మలుపులు ఎదురవుతాయి. ఈ చిత్రం అక్టోబర్ 1986లో ఇడుక్కిలోని కామాక్షి గ్రామ పంచాయితీలోని థంకమణి అనే గ్రామంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించబడింది. కథలో మంచి సస్పెన్స్, ట్విస్ట్స్ ఉన్నప్పటికీ కథనంలో అన్నిటినీ సరిగ్గా కుదర్చలేదనే టాక్ తెచ్చుకుంది థంకమణి సినిమా. మరి ఓటీటీలో ఈ సినిమాకి ఎలాంటి స్పందన వస్తుందో చూద్దాం.

Show comments