Venkateswarlu
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన వారు కూడా తర్వాత ఎలాంటి అవకాశాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందరూ ఆ కష్టాల్ని తట్టుకుని నిలబడ్డం సాధ్యం కాదు..
చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. స్టార్‌గా ఓ వెలుగు వెలిగిన వారు కూడా తర్వాత ఎలాంటి అవకాశాలు లేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందరూ ఆ కష్టాల్ని తట్టుకుని నిలబడ్డం సాధ్యం కాదు..
Venkateswarlu
సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోల్చుకుంటే.. హీరోయిన్ల లైఫ్ స్పాన్ చాలా తక్కువ. ఏళ్ల తరబడి హీరోయిన్లుగా కొనసాగటం సాధ్యం కాదు. కారణాలు ఏవైనా కావచ్చు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా వెలుగొందిన వారు తర్వాత సైడ్ క్యారెక్టర్లకు పరిమితం అయిన సంఘటనలు చాలా ఉన్నాయి. భాష ఏదైనా కావచ్చు.. చిత్ర పరిశ్రమలో నటీమణుల పరిస్థితి ఇది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి వచ్చిన కారణంగానే చాలా మంది చిత్ర పరిశ్రమను వదిలి వెళ్లిపోతుంటారు.
మరికొంతమంది నటన మీద ఆసక్తితో సైడ్ క్యారెక్టర్‌లు చేస్తూ తమ ఉనికిని చాటుకుంటూ ఉంటారు. పై ఫొటోలో కనిపిస్తున్న ఆమె కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో చాలా సినిమాలు చేశారు. అందం, అభినయంతో అన్ని భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గటంతో సెకండ్ హీరోయిన్‌గా చేశారు. అలా కూడా అవకాశాలు తగ్గటంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేస్తున్నారు.
ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీ మొత్తాన్ని తనవైపు తిప్పుకున్నారు. ఈ పాటికే ఆమె ఎవరో మీకు అర్థం అయిపోయి ఉంటుంది. అవును! మీరు ఊహించింది కరెక్టే ఆమె ఇంకెవరో కాదు.. సంగీత. ఆమె 1997లో ‘గంగోత్రీ’ అనే మలయాళ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. అదే సంవత్సరం కన్నడలో ‘ ఈ హృదయ నినగాగి’ అనే సినిమాలో నటించారు. 1999లో ‘ఆశల సందడి’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ సినిమా తర్వాత ఆమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత 2001లో ‘నవ్వుతూ బతకాలిరా!’ సినిమా చేశారు.
2002లో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా సంగీత కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు ఉత్తమ సహాయ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు వచ్చింది. ‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’ అన్న డైలాగ్ అప్పటికీ ఇప్పటికీ చాలా ఫేమస్. ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల్లో ఈమె చెరగని ముద్ర వేసుకున్నారు. అంతేకాదు! ఖడ్గం కారణంగా ఆమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి. సినిమాల్లో హీరోయిన్‌గా బిజీగా ఉన్న సమయంలోనే క్రిష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో కొనసాగారు. అయితే, హీరోయిన్‌గా అవకాశాలు తగ్గి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు. సంగీతను మలయాళంలో రషిక అని.. కన్నడలో దీప్తి అని పిలుస్తారు. పై ఫొటో ఆమె హీరోయిన్‌గా చేసిన తొలి సినిమాలోనిది. ఆ ఫొటోలో ఆమె పక్కన ఉన్నది స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు.