Venkateswarlu
తల్లి ఓ స్టార్ హీరోయిన్, తండ్రి ఓ స్టార్ ప్రొడ్యూసర్.. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ సినిమాలు చేస్తూ ఉన్నారు.
తల్లి ఓ స్టార్ హీరోయిన్, తండ్రి ఓ స్టార్ ప్రొడ్యూసర్.. స్టార్ కిడ్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. బాలీవుడ్ టు టాలీవుడ్ సినిమాలు చేస్తూ ఉన్నారు.
Venkateswarlu
బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లో నెగ్గుకు రావటం చాలా కష్టం. ముఖ్యంగా నటీమణులు సినిమాల్లో అవకాశాలు తెచ్చుకోవటానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. బ్యాక్ గ్రౌండ్ లేని వారితో పోల్చుకుంటే.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారికి సినిమాల్లో ఎంట్రీ సులభతరం అవుతుంది. రెండు మూడు సినిమాల వరకు ఎలాంటి అడ్డంకి ఉండదు. కానీ, తర్వాతినుంచి వారి భవిష్యత్తు వారి చేతుల్లో.. అదృష్టం చేతుల్లోకి వెళ్లిపోతుంది. స్టార్ కిడ్స్‌గా ఇండస్ట్రీలోకి వచ్చినా.. సరైన సినిమాలు పడక ఇండస్ట్రీకి దూరం అయిన వాళ్లు చాలా మంది ఉన్నారు.
కానీ, చాలా కొద్ది మంది స్టార్ కిడ్స్ మాత్రమే తమ టాలెంట్‌తో నిలదొక్కుకుంటున్నారు. అలాంటి వారిలో పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకరు. ఆమె తల్లి భారత దేశం గర్వించదగ్గ ఓ నటి. తండ్రి దిగ్గజ దర్శకుడు. స్టార్ కిడ్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తర్వాత తన అందం అభినయంతో కెరీర్‌ను సక్సెస్ ఫుల్‌గా ముందుకు తీసుకెళుతోంది. చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన చాలా ఏళ్ల తర్వాత తెలుగులో మొదటి సినిమా చేస్తోంది. అది కూడా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో..
ఇప్పటికే మీకు అర్థం అయిపోయి ఉంటుంది ఆ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరా అని. అవును! మీరు ఊహించింది కరక్టే.. ఆమె బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్. శ్రీదేవి- బోనీ కపూర్‌ల గారాల కూతురు. జాన్వీ 2018లో వచ్చిన ‘ ధడక్’ అనే సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. హీరోయిన్‌గానే కాదు.. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ‘దేవర’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ‘తంగం’ అనే పాత్రలో నటిస్తున్నారు.
దేవర రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు భాగాల్లోనూ జాన్వీ కపూర్ కనిపించనున్నారు. ఇక, దేవర సినిమా గురించి జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తెలుగులో సినిమా చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. సౌత్ తన సొంతిళ్లని పేర్కొన్నారు. దేవర తన తొలి తెలుగు సినిమా అని చెప్పారు. తనకు తెలుగు రాదని, ఇప్పుడు డైలాగ్స్ నేర్చుకోవటానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నానని తెలిపారు. ఇంట్లో తల్లి శ్రీదేవి హిందీ, ఇంగ్లీష్‌లోనే మాట్లాడేదని తెలిపారు.
కానీ, చెన్నై వెళ్లిపోయినపుడు తమిళంలో మాట్లాడేదని, అందుకే తనకు తెలుగు కంటే తమిళమే బాగా తెలుసని అన్నారు. దేవర సినిమాలో పని చేయటం సొంత గూటికి వచ్చినట్లుగా ఉందని, అమ్మ వారసత్వాన్ని ముందుకు తీసుకెళుతున్నట్లుగా ఉందంటూ ఎమోషనల్ అయ్యారు. మరి, జాన్వీ కపూర్ సక్సెస్ ఫుల్ జర్నీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.