వెంకట్ నటించిన ‘హరుడు’ సినిమా గ్లింప్స్ విడుదల!

Harudu Movie: ‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన వెంకట్ ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించాడు. తాజాగా హీరో వెంకట్ హరుడు మూవీలో నటిస్తున్నాడు.

Harudu Movie: ‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి’ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయిన వెంకట్ ఆ తర్వాత పలు చిత్రాల్లో హీరోగా, క్యారెక్టర్ పాత్రల్లో నటించి మెప్పించాడు. తాజాగా హీరో వెంకట్ హరుడు మూవీలో నటిస్తున్నాడు.

‘శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి’ మూవీతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి..  శివరామరాజు మూవీతో మంచి పేరు సంపాదించిన వెంకట్ తొలిసారి మాస్ హీరోగా నటిస్తున్న చిత్రం హరుడు.   ఈ చిత్రానికి రాజ్ తాళ్ళూరి దర్శకత్వం వహించగా.. డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మిస్తున్నారు.  షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. తాజాగా హరుడు చిత్రం గ్లింప్స్ శనివారంనాడు హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో విడుదల చేశారు.   గ్లింప్స్ స్టార్టింగ్.. ‘ మంచి చేసేవారికి  నాపేరు డీసీపీ శంకర్.. అదే ఎక్స్‌ట్రా చేసే నా కొడుకులకు నా పేరు ఎన్ కౌంటర్’ అంటూ వెంకట్ ఇంట్రడక్షన్ అదిరిపోయింది. పోలీస్ ఆఫీసర్ గా వెంకట్ పర్ఫామెన్స్ దుమ్మురేపినట్లు అనిపిస్తుంది.

హరుడు మూవీ గ్లింప్స్ రిలీజ్ అనంతరం  నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ మూవీ ఎంతో బాగా వచ్చింది. ఇందు కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేశారు. ఈ సినిమా దర్శకుడు రాజ్ తాళ్లూరి రాత్రింబవళ్ళు ఎంతో కష్టపడి పని చేశారు.   హీరో వెంకట్, శ్రీహరి, సలోని, హెబ్బా పటేల్ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు.  ఇందులోని పాటలు చాలా బాగున్నాయి. జెన్నా పాటలకు సంగీతం బాగా సమకూర్చారు. ఈ రోజు విడుదలైన గ్లింప్స్  చాలా బాగుంంది..  మంచి విజయం సాధించాలని కోరుకుంటన్నా అన్నారు.

దర్శకుడు రాజ్ తాళ్ళూరి మాట్లాడుతూ.. ‘ఇంత మంచి చిత్రం నాకు ఇచ్చినందుకు   నిర్మాత డాక్టర్ ప్రవీణ్ రెడ్డి కి థ్యాంక్స్.  సినిమా కథ నచ్చి  ఐదు నిముషాల్లోనే  ఓకే చేశారు. నాకు ఐదేళ్ల నుంచి వెంకట్ తో పరిచయం ఉంది.. ఆయనతో జర్నీ అవుతున్నా. ఒకప్పుడు లవర్ బాయ్ గా చేసిన వెంకట్ ఈ మూవీలో పూర్తిగా యాంగ్రీ పోలీస్ మాన్, మాస్ హీరోగా కనిపిస్తాడు.  సంగీత దర్శకుడు జిన్నా, ఎడిటర్ మారుతీ బాగా పనిచేశారు. దర్శకుల టీమ్ సపోర్ట్ గా చాలా బాగుంది.. అందుకే  అవుట్ పుట్ బాగా వచ్చింది. అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు.

ఇక  హీరో వెంకట్ మాట్లాడుతూ.. ‘తెలుగు ప్రేక్షకులు కంటెంట్ బాగు ఎలాంటి సినిమాలైన ఆదరిస్తారు.  హరుడు మూవీ కమర్షియల్ ఎలిమెంట్‌తో మాస్ ఎంటర్ టైనర్ గా అందరికీ నచ్చుతుంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా 60 శాతం పూర్తయింది. మొదటి నుంచి సినిమాలంటే ఎంతో అభిమానం చూపించే డాక్టర్ ప్రవీణ్ రెడ్డి నిర్మాతగా మారి మంచి సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు.   ఆయనకు మంచి హిట్ పడాలని ఆశిస్తున్నాను.  హరుడు మూవీలో నేను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.. ఆ క్రెడిబులిటీ మొత్తం మా దర్శకులు  రాజ్ తాళ్ళూరి కే దక్కుతుంది.  మాస్ పాత్ర నేను మొదటిసారి చేశాను. నా పాత్రకు ధీటుగా హెబ్బాపటేల్ పాత్ర వుంటుంది.. ఆమె నటన చూసి అందరూ మెచ్చుకుంటారు.   అలాగే నటశాసింగ్ మరో పాత్ర చేసింది. ఇక స్పెషల్ సాంగ్ లో సలోని పర్ఫామెన్స్ తో అదరగొట్టింది.  ఇందులో ఐదు పాటలున్నాయి. సంగీత దర్శకుడు మణి జెన్నా మంచి బ్యాగ్ గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు.  మాస్ సినిమాకు ఫైట్స్ కీలకం. శివరాజ్ మాస్టర్ బాగా కంపోజ్ చేశారు. గతంలో ఒక షూటింగ్ లో నాకు గాయాలు అయ్యాయి. అందుకే ఇండస్ట్రీకి  కొంత గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ మూవీలో చాాలా  జాగ్రత్తలు తీసుకుని ఫైట్స్ చేశాను. వచ్చే నెలలో సినిమా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నాం అని చెప్పారు.

Show comments