P Krishna
కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ వైపు మళ్లారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో లేటెస్ట్ మూవీస్, వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
కరోనా తర్వాత చాలా మంది ఓటీటీ వైపు మళ్లారు. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో లేటెస్ట్ మూవీస్, వెబ్ సీరీస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.
P Krishna
ఒకప్పుడు సినిమా థియేటర్లలో వచ్చిన సినిమాలు ఎప్పటికో కానీ టీవీల్లో వచ్చేవి కావు. అలాంటిది ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓటీటీ పుణ్యమా అని రిలిజ్ అయిన కొద్ది రోజుల్లోనే మన కళ్లముందుకు వస్తున్నాయి. ఈ రోజుల్లో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. సినిమాలు మాత్రమే కాదు.. వెబ్ సీరీస్ తో ఊదరగొట్టేస్తున్నాయి. వెండితెరకు ధీటుగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. తాము చూడలేని సినిమాలు హ్యాపీగా ఇంట్లో కూర్చుని చూసే అవకాశం లభిస్తుంది. ముఖ్యంగా కరోనా తర్వాత చాలా మంది ఓటీటీలో చూడటానికే ఇష్టపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలోనే ఫిల్మ్‌ఫేర్ ఓటీటీ అవార్డ్ 2023 వేడు అంగరంగ వైభవంగా జరిగింది. వివరాల్లోకి వెళితే..
బుల్లితెరపై ఓటీటీ ప్రేక్షకులను అలరించే నటీనటులకు, దర్శకులను ప్రోత్సహించడానికి గత కొంతకాలంగా ఫిల్మ్‌ఫేర్.. ఓటీటీ అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023 వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ అవార్డుల్లో 2023 కి గాను బెస్ట్ వెబ్ సీరీస్ గా స్కూప్ నిలిచింది. ఈ ఏడాది ఓటీటీల్లోని బెస్ట్ వెబ్ సీరీస్, బెస్ట్ ఒరిజినల్ మూవీస్, బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్ అలాగే బెస్ట్ టెక్నీషియన్స్ అవార్డులను అందజేశారు. 2011లో జరిగిన మిడ్ డే రిపోర్టర్ జ్యోతిర్మయి డే హత్య నేపథ్యంలో తెరకెక్కించారు. ఇందులో బెస్ట్ మేల్ యాక్టర్ గా రాజ్ కుమార్ రావు.. బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా అలియా భట్ నిలిచారు. ఇక డార్లింగ్స్ మూవీకి గాను అలియా భట్ అవార్డు అందుకున్నారు. అలాగే మోనికా ఓ మై డార్లింగ్ మూవీకి గాను రాజ్ కుమార్ రావ్ కి అవార్డు వరించింది. వెబ్ సీరీస్ లో బెస్ట్ ఫిమేల్ యాక్టర్ గా స్కూప్ లో నటించిన కరిష్మా తన్నా, దహన్ లో నటించిన సోనాక్షి సిన్హా ను వరించాయి. ఇక బెస్ట్ యాక్టర్ మేల్ కేటగిరిలో దహన్ వెబ్ సీరిస్ లో నటించిన విజయ్ వర్మ అవార్డు అందుకున్నారు. బెస్ట్ వెబ్ సీరీస్ (క్రిటిక్స్) కేటగిరిలో డిన్నీ ప్లస్ హాట్ స్టార్ లో అందరినీ ఆకట్టుకున్న ట్రయల్ బై ఫైర్ కి అవార్డు వచ్చింది.