Swetha
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898AD. రోజు రోజుకి ఈ సినిమాపైన అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.
ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న చిత్రం కల్కి 2898AD. రోజు రోజుకి ఈ సినిమాపైన అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు ఇలా ఉన్నాయి.
Swetha
బాహుబలి రిలీజ్ తర్వాత అన్ని ఇండస్ట్రీల కన్ను పాన్ ఇండియా సినిమాలపై పడింది. భారీ బడ్జెట్, హ్యుజ్ స్థార్ కాస్ట్ తో మార్కెట్ ను షేక్ చేద్దామని దర్శక నిర్మాతలు బయలుదేరారు. అయితే.. కొంత మంది సక్సెస్ అవ్వగా చాలామంది బోల్తాపడటమే కాక తీవ్ర నష్టాల పాలయ్యారు.ఇక బాహుబలితో పాన్ ఇండియన్ స్టార్ అయిన ప్రభాస్ సైతం ఆ మూవీ తర్వాత బాక్స్ ఆఫీస్ వద్ద చతికిల పడ్డారు. ఐదేళ్ల తర్వాత మళ్ళి “సలార్” తో గాడిలోకి వచ్చిన ప్రభాస్ ఈ సారి “కల్కి 2898AD” తో అన్ని రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్దమవుతున్నాడు. ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో 600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడు చూడని VFX తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడిపుడే తిరిగి గాడిలో పడుతున్న ప్రభాస్ కెరీర్లోనే ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడంతో పాటు అన్ని రికార్డులు తిరగరాస్తుంది అనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వైజయంతీ బ్యానర్లో అశ్వినీ దత్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం రీలీజ్ కు ముందే భారీ బిజినెస్ చేసుకొని లాభాలను పొందటానికి సిద్దమవుతుంది.
ఇప్పటి వరకు ప్రీ రీలీజ్ బిజినెస్ లో RRR ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉండగా, కల్కి ఆ రికార్డులను సైతం బ్రేక్ చేసే దిశగా పావులు కదుపుతుంది. కాగా ఈ చిత్రం టార్గెట్ @500 కోట్లు. కేవలం తెలుగు రాష్ట్రాలలోనే థియేట్రికల్ హక్కులకు అక్షరాలా 200 కోట్లుటా.. ఇక ఓవర్సీస్ మార్కెట్లలో ఎంత లేదన్న 100 కోట్లకు విక్రయించాలని ఫిక్స్ అయిపోయారట. తమిళ, కన్నడ, హిందీ, మలయాళ హక్కులను 200 కోట్లకు అమ్మాలని చూస్తున్నారు. కన్నడలో ఇప్పటికే 50 కోట్లతో హైయెస్ట్ నాన్- కన్నడ మూవీగా ఫ్రీ రీలీజ్ బిజినెస్ జరిగిందని టాక్. ఇక ఫ్రీ రీలీజ్ బిజినెస్ కి ప్రధానంగా స్టార్ అట్రాక్షన్ బిగ్ ప్లస్. RRR కి రామ్ చరణ్, జూ. ఎన్టీర్, అలియా భట్, అజయ్ దేవ్‌గన్ స్టార్ ఇమేజ్ తో పాటు జక్కన మాయాజాలం ఎంతోగా తోడ్పడ్డాయి. కానీ.. కల్కి విషయంలో ప్రభాస్ ఒక్కడే స్టార్ అట్రాక్షన్ అంటున్నారు సినీ పండితులు. బిగ్ బి అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొనె పేర్లపై బిజినెస్ జరిగే ఛాన్స్ లేదంటున్నారు.
అయితే, మే 9న ప్రపంచ వ్యాప్తంగా రీలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం.. కేవలం ఇండియన్ ఆడియెన్స్ టార్గెట్ గా మాత్రమే రావట్లేదు అని గుర్తుంచుకోవాలి. అమెరికాలోని సాన్ డియాగోలో కామికన్ వేదికగా రీలీజ్ అయిన గ్లిమ్ప్స్ హాలీవుడ్ క్రిటిక్స్ ని ఎంతోగాను ఆకర్షించింది. ఇది పాన్ ఇండియా సినిమా కాదు గ్లోబల్ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్న చిత్రం. కాబట్టి ఎన్ని రికార్డులను ఈ మూవీ బ్రేక్ చేయనుందో తెలుసుకోవాలంటే ఈ సమ్మర్ వరకు ఓపిక పట్టాల్సిందే. కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ పై మీ కామెంట్స్ ని అభిప్రాయాలను కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.