RRR కలెక్షన్స్ పై నిర్మాత దానయ్య షాకింగ్ కామెంట్స్!

Dvv Danayya Comments On RRR Profits: ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. వాటిలో ట్రిపులార్ కూడా ఒకటి. ఈ సినిమా కలెక్షన్స్- లాభాలకు సంబంధించి తాజాగా నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.

Dvv Danayya Comments On RRR Profits: ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించారు. వాటిలో ట్రిపులార్ కూడా ఒకటి. ఈ సినిమా కలెక్షన్స్- లాభాలకు సంబంధించి తాజాగా నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య.. టాలీవుడ్ నిర్మాతల్లో ఈయన అప్రోచ్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది అంటారు. ఎందుకంటే ఎవరైనా ఒక డైరెక్టర్ హిట్టు కొట్టిన తర్వాత సినిమా ఆఫర్ ఇవ్వడం, నాకు సినిమా చేసి పెట్టు అని అడుగుతారు. కానీ దానయ్య మాత్రం.. ఒక గొప్ప డైరెక్టర్ అయిపోతాడు అని ముందే ఊహించి అడ్వాన్స్ ఇచ్చేస్తారట. అలాగే రాజమౌళి, త్రివిక్రమ్ కు ఎప్పుడో అడ్వాన్సులు కూడా ఇచ్చి ఉన్నారు. అలా కేవలం డైరెక్టర్లే కాదు.. హీరోలు, రైటర్స్ కి కూడా అలాగే అడ్వాన్సులు ఇస్తారంట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చాలానే ఆసక్తికర విషయాలు దానయ్య పంచుకున్నారు. అలాగే RRR సినిమా కలెక్షన్స్ కి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు.

డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ మీద ఇప్పటికే ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. తాజాగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకులను పలకరించారు. అయితే డీవీవీ బ్యానర్స్ లో వచ్చిన చిత్రాల్లో ప్రపంచం మొత్తం మాట్లాడుకున్న.. ఆస్కార్ అవార్డును గెలుచుకొచ్చిన చిత్రం RRR. ఈ మూవీ రాజమౌళి- రామ్ చరణ్- తారక్ కెరీర్లలోనే కాదు.. డీవీవీ బ్యానర్లో కూడా అతి పెద్ద ప్రాజెక్ట్. సినిమా గ్లోబల్ లెవల్లో అద్భుతమైన విజయాన్ని సాధించింది. దానికి తగినట్లు వసూళ్లను కూడా రాబట్టింది. ఆ కలెక్షన్స్ ఎంత? అసలు లాభాలు ఎంత వచ్చాయి? అనే ప్రశ్నలు ఇప్పటికీ వినిపిస్తూ ఉంటాయి. ఆ లాభాలకు సంబంధించి దానయ్యను ప్రశ్నించగా.. ఆయన నిర్మొహమాటంగా సమాధానం చెప్పడానికి నిరాకరించారు. అంతేకాకుండా.. ఆ విషయాన్ని మీరు అడగకూడదు- నేను చెప్పకూడదు అంటూ సింపుల్ గా ఖండించారు.

ఈ ఇంటర్వ్యూలో ఆయన ఎలా సినిమాలను జడ్జ్ చేస్తారు? కథలు ఎలా వింటారు? అనే విషయంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఏదైనా కథ వినగానే దాని రిజల్ట్ ని అంచనా వేయగలను అన్నారు. ఒక సినిమా కథ వినగానే అది సక్సెస్ అవుతుందో లేదో ఆయనకు అర్థమైపోతుందంట. అలాగే ఒక రైటర్ ని చూసినా.. డైరెక్టర్ ని చూసినా అతను సక్సెస్ అవుతాడో లేదే చెప్పేయగలనన్నారు. ఆయన కొత్త దర్శకులతో మాత్రం సినిమా చేయను అని చెప్పారు. కనీసం ఒక సినిమా చేసిన డైరెక్టర్ అయినా అయితే సినిమాని హ్యాండిల్ చేయగలరు అని నమ్మకం ఉంటుంది అన్నారు. ఓజీ గురించి కూడా కీలక అప్ డేట్ ఇచ్చారు. వచ్చే ఏడాది మార్చి నెలలోపే సినిమా విడుదల అయ్యేలా చూస్తామంటూ నిర్మాత డీవీవీ దానయ్య హామీ ఇచ్చారు.

Show comments