డంకీ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎక్కడంటే..

షారుఖ్‌ ఖాన్‌ మొదటి సారి రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సినిమా చేశారు. డంకీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందకు వచ్చింది. చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

షారుఖ్‌ ఖాన్‌ మొదటి సారి రాజ్‌ కుమార్‌ హిరానీ దర్శకత్వంలో సినిమా చేశారు. డంకీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందకు వచ్చింది. చిత్రానికి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్‌ ఖాన్‌- దిగ్గజ దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ డంకీ’ మూవీ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల అయింది. విడుదల అయిన అన్ని భాషల్లో సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. రాజ్‌ కుమార్‌ హిరానీ దాదాపు 5 ఏళ్ల గ్యాప్‌ తర్వాత తీసిని డంకీ.. బాక్సాఫీస్‌ వద్ద విజయ ఢంకా మోగించింది. ప్రేక్షకులతో పాటు రివ్యూవర్లు కూడా డంకీకి మంచి రివ్యూలు ఇచ్చారు.

ఇక, ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్‌ ప్లాట్‌ ఫామ్‌ ముందుగానే ఫిక్స్‌ అయినట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ ఫామ్‌ జియో సినిమాలో డంకీ స్ట్రీమింగ్‌ అవ్వనుందని సమాచారం. స్ట్రీమింగ్‌ డేట్‌ అయితే అనౌన్స్‌ కాలేదు. డంకీకి థియేటర్లలో వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఓటీటీలోకి వచ్చే తేదీ ఖరారు అవుతుంది. కాగా, డంకీ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌కు జంటగా తాప్సీ పన్ను నటించారు. విక్కీ కౌశల్‌, అనిల్‌ గ్రోవర్‌, విక్రమ్‌ కొచ్చర్‌, బొమన్‌ ఇరానీలు కీలక పాత్రల్లో కనించారు.

డంకీ కథ ఏంటంటే.. 

హర్‌దయాల్‌ సింగ్‌ దిల్హాన్‌(షారుఖ్‌ ఖాన్‌), మను (తాప్సీ పన్ను), సుఖీ (విక్కీ కౌశల్‌) బల్లి(అనిల్‌ గ్రోవర్‌), బగ్గు ( విక్రమ్‌ కొచ్చర్‌) పంజాబ్‌లోని లాల్టూ అనే టౌన్‌కు చెందిన వారు. వీరందరూ ఎప్పటికైనా లండన్‌కు వెళ్లాలని కలలు కంఊట ఉంటారు. ఈ కలే వీరిని ఒక్కటి చేస్తుంది. వీరంతా లండన్‌ వెళ్లటం కోసం ఇంగ్లీష్‌ కూడా నేర్చుకోవటానికి ప్రయత్నిస్తారు. అయితే, సరిగ్గా మాట్లాడలేని కారణంగా వీరికి వీసాలు దొరకవు. ఈ నేపథ్యంలోనే మొత్తం నలుగురు అక్రమంగా లండన్‌ వెళ్లడానికి ప్రయత్నిస్తారు. ఇలా లండన్‌కు వెళ్లే సమయంలో వీరికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఇంతకీ వీళ్లు లండన్‌కు వెళ్లారా? లేదా? అన్నదే మిగిలిన కథ.

కాగా, కలెక్షన్ల విషయంలో డంకీ అనుకున్నదాని కంటే వెనుక బడింది. షారుఖ్‌ ఖాన్‌ గత చిత్రాలు పఠాన్‌, జవాన్ల ఫస్ట్‌ డే కలెక్షన్ల కంటే.. డంకీ కలెక్షన్లు చాలా తక్కువ వచ్చాయి. పఠాన్‌ మొదటి రోజు 106 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. జవాన్‌ మొదటి రోజు 129 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టింది. డంకీ మాత్రం ఈ రెండిటి కంటే వెనుక బడింది. కేవలం 95 కోట్ల రూపాయల కలెక్షన్లకు మాత్రమే పరిమితం అయింది. సలార్‌ సినిమాకు పోటీ వస్తుందనుకున్న మూవీ.. అసలు పోటీలోనే లేకుండా పోయింది. మరి, డంకీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌ వివరాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments