Dulquer Salmaan, ‘Thug Life’: కమల్ థగ్ లైఫ్ నుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్

కమల్ థగ్ లైఫ్ నుంచి తప్పుకున్న దుల్కర్ సల్మాన్

Dulquer Salmaan, ‘Thug Life’: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రథాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌. ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Dulquer Salmaan, ‘Thug Life’: లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రథాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌. ఈ సినిమాలో యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఉన్న అద్భుతమైన నటుల్లో ఒకరు దుల్కర్ సల్మాన్. మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందారు. కాగా లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ప్రథాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ డ్రామా థగ్ లైఫ్‌లో ఒక ముఖ్య పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు గతంలో మేకర్స్ ప్రకటించారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం దుల్కర్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికైతే కారణాలు ఎంటనేవి తెలియదు కానీ దుల్కర్ సల్మాన్ థగ్ లైఫ్ నుండి వైదొలిగినట్లు గట్టి టాక్ వినిపిస్తుంది. ఈ చిత్రంలో త్రిష, జయం రవి, నాజర్, అభిరామి సహా భారీ తారాగణాన్ని నిర్మాతలు ప్రకటించారు. ఆస్కార్ అవార్డ్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తారు. కమల్ హాసన్ – మణిరత్నం చివరిసారిగా నాయకన్‌ సినిమాకి కలిసి పని చేశారు. 36 ఏళ్ల తరువాత ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా కోసం తిరిగి కలిశారు. కమల్ – దుల్కర్ ల మధ్య మంచి పోటాపోటీ సన్నివేశాలు ఉంటాయని ఆశించిన అభిమానులు ఇప్పుడు దుల్కర్ సినిమాలో లేరనే వార్త విని ఖచ్చితంగా నిరాశపడతారు.

ఇక దుల్కర్ సల్మాన్ నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే… సూర్య 43వ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తారు. ఈ విషయాన్ని గతంలో తన ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ లో స్వయంగా ప్రకటించారు. సుధా కొంగర ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తారు. అలాగే వెంకీ అట్లూరి దర్శకత్వంలో లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో కూడా నటిస్తున్నారు దుల్కర్. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ లో చుట్టూ కరెన్సీ నోట్లు, వెనుక వైపు బాంబే స్టాక్ ఎక్స్ చేంజ్ మధ్య కళ్ళద్దాలతో గ్రే కలర్ షర్ట్ తో ఉన్న హీరో దుల్కర్ లుక్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. సీతారామం తరువాత దుల్కర్ నుంచి వస్తున్న స్ట్రెయిట్ తెలుగు సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Show comments