మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఏమైనట్లు .. నెక్స్ట్ సినిమా ఎప్పుడు ?

Director trivikram srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ దర్శకుడి గురించి తెలియని వారు ఉండరు . ఒక్కో మాట ఒక్కో తూటాలా ఉంటుంది. మరి ఈ దర్శకుడు ఏమైనట్లు. మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తున్నట్లు. అసలు ఈ దర్శకుడి గురించి ఎలాంటి టాక్ వినిపించడం లేదు. ఆ విషయాలు చూసేద్దాం.

Director trivikram srinivas: త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ దర్శకుడి గురించి తెలియని వారు ఉండరు . ఒక్కో మాట ఒక్కో తూటాలా ఉంటుంది. మరి ఈ దర్శకుడు ఏమైనట్లు. మళ్ళీ ఎప్పుడు సినిమా తీస్తున్నట్లు. అసలు ఈ దర్శకుడి గురించి ఎలాంటి టాక్ వినిపించడం లేదు. ఆ విషయాలు చూసేద్దాం.

ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలంటే.. కేవలం ఆరితేరిన నటీ నటులు మాత్రమే ఉంటే సరిపోదు. వాళ్ళని తనకు కావలసినట్టు మలచుకునే మాంత్రికుడు కూడా ఉండాలి. అలా టాలీవుడ్ లో ఎంతో మంది టాలెంటెడ్ దర్శకులు ఉన్నారు. తీసిన ప్రతి సినిమా హిట్ అవుతుందన్న గ్యారెంటీ అయితే లేదు. సో కొన్ని సార్లు దర్శకులు డిజాస్టర్స్ చూస్తూ ఉంటారు. అయినా కానీ.. వారి వద్ద ఉన్న స్ట్రాంగ్ కంటెంట్ కు.. ఓ స్టార్ హీరో చిక్కితే మాత్రం.. బౌన్స్ బ్యాక్ అవ్వడం చాలా ఈజీ. దానికి నిదర్శనాలు కూడా లేకపోలేదు. అలాంటి దర్శకులకు హిట్స్ ఇస్తున్న స్టార్స్ ఎవరో కూడా తెలియనిది కాదు. ఒక డిజాస్టర్ తో కోల్పోయిన నమ్మకాన్ని గెలుచుకోవడానికి.. ఎలాగైనా హిట్ కొట్టాలన్నకసితో నెక్స్ట్ మూవీస్ తీస్తూ ఉంటారు. అలాంటి వారిలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కూడా ఒకరు. అయితే ఇప్పుడు త్రివిక్రమ్ గురించి ఎలాంటి టాక్ వినిపించడం లేదు. త్రివిక్రమ్ ఏమైనట్లు?

త్రివిక్రమ్ అనగానే ఒక్కో మాట ఒక్కో తూటాలా ఉంటుందని.. సింపుల్ డైలాగ్స్ తో ఎఫెక్టీవ్ కంటెంట్ ఇస్తాడని.. ఆయన మాటలు వింటేనే గూస్ బంప్స్ వస్తాయని.. ఇలా ఒకటా రెండా ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. ఆయన రాసిన మాటలు , తీసిన అద్భుతమైన చిత్రాలు కళ్ళముందు కనిపిస్తాయి. ప్రత్యేకించి ఆయన మాటలకు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉన్నారు. అలాంటి త్రివిక్రమ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. అరవింద సమేత సినిమా తర్వాత త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీశారు. అరవింద సమేత ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలియనిది కాదు. కానీ గుంటూరు కారం సినిమాకు మాత్రం అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాలేదు. అసలు ఇది గురూజీ పెన్ నుంచి వచ్చిన కథ కాదు అంటూ ఎన్నో ట్రోల్స్ వచ్చాయి. ఇక ఆ తర్వాత ఆయన ఎక్కడా సందడి చేయలేదు. అసలు కనీసం మైక్ పట్టుకోడానికి కూడా ఇష్టపడడం లేదట. దీనితో ఆయన అభిమానులకు అసలు త్రివిక్రమ్ ఏమైనట్లు ? కథల్లేవా ? ఖాళీగా లేడా ? లేదా కథలు వినడానికి హీరోలు లేరా ? అని రకరకాల ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

అభిమానులకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తడంతో తప్పు లేదు. ఎందుకంటే దాదాపు దర్శకులంతా ఓ సినిమా తర్వాత మరో సినిమా అప్డేట్ ను వెంట వెంటనే ఇస్తూ ఉంటారు. కానీ త్రివిక్రమ్ నుంచి మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఆయన కొన్ని సినిమాలకు మాటలు రాస్తూ.. మరికొన్ని సినిమాలకు దర్శకత్వం పర్యవేక్షణ చేస్తూ.. అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ తోనే సరిపెడుతున్నారట. అంతేకాని డైరెక్ట్ గా ఒక్క కథతో ముందుకు వెళ్లడం , వేరే వాళ్ళ కథలు తీసుకుని సినిమాలు తీయడం లాంటివి చేయడం లేదని సమాచారం. అయితే త్రివిక్రమ్ అల్లు అర్జున్ కోసం ఓ కథ రెడీ చేసినట్లు , పుష్ప-2 తర్వాత ఈ మూవీనే స్టార్ట్ చేస్తారంటూ టాక్ అయితే వినిపిస్తుంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన  రావాల్సి ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే , గురూజీ పెన్ నుంచి ఈసారి అద్భుతమైన కథ వచ్చే ఛాన్స్ ఉంది. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments