ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ డైరెక్టర్ మృతి

Kumar Shahani ఊasses away: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రముఖ దర్శకులు, నిర్మాత కన్నుమూయడంతో బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.

Kumar Shahani ఊasses away: ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తున్నాయి. ప్రముఖ దర్శకులు, నిర్మాత కన్నుమూయడంతో బాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది.

ఈ మద్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను దుఖః సాగరంలో ముంచేస్తున్నాయి. నటీనటులు, దర్శక, నిర్మాతలు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు పలు కారణాలతో చనిపోతున్నారు. ముఖ్యంగా హార్ట్ ఎటాక్, రోడ్డు ప్రమాదాలు, వయోభారం, ఆర్థిక సమస్యల కారణంతో చనిపోతున్నారు. సెలబ్రెటీలు కన్నుమూయడంతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. బాలీవుడ్ లో పలు సూపర్ హిట్ తెరకెక్కించిన దర్శకుడు కన్నుమూయడంతో తీవ్ర విషాదం నెలకొంది. మాయా దర్భన్, తరంగ్ లాంటి చిత్రాలతో ఫేమ్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకులు, స్క్రీన్ రైట్, నిర్మాత కుమార్ షహానీ శనివారం కన్నుమూశారు. 1940, డిసెంబర్ 7న సింధ్ లోని లర్కానాలో (ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉంది)లో జన్మించారు. వీరి కుటుంబం పాకిస్థాన్ విభజన తర్వాత ముంబాయికి వచ్చారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి బీఏ (ఆనర్స్) లో పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ఫిలిమ్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ లో డైరెక్షన్ అభ్యసించారు. దర్శకుడిగా స్క్రీన్ రైటర్ గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. 1972 లో మాయా దర్భన్, 1984 లో తరంగ్, 1989లో ఖయల్ గాధ, 1990లో కస్బా లాంటి హిట్ సినిమాలకు తీసి బాగా పాపులర్ అయ్యారు.

హిందీ రచయిత అయిన నిర్మల్ వర్మ రాసిన చిన్న కథ ఆధారంగా తెరకెక్కంచిన మాయా దర్భన్ మూవీకి మొదటి ఫార్మలిస్ట్ చిత్రాల్లో ఒకటిగా పనిగణించబడింది. విమర్శకులు నుంచి ప్రశంసలు అందాయి. అంతేకాదు అప్పట్లో ఈ మూవీ ఉత్తమ చలన చిత్రంగా జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది. 2022లో ఈ మూవీ స్వర్ణోత్సవం జరుపుకుంది. కుమార్ షహానీ కెరీర్‌ విషయానికి వస్తే.. పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)లో చదివాడు. తర్వాత ఫ్రాన్స్‌కు వెళ్లి రాబర్ట్ బ్రెస్సన్‌కి ఫిలిమ్ మేకింగ్ లో సహాయం చేశాడు. ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలకు తావుల లేకుండా తన కెరీర్ ని కొనసాగించారు.  కుమార్ షహానీ సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు నివాళులర్పించారు.

Show comments