సభ్య సమాజం తలదించుకునే ఎన్నో సంఘటనలు దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి సంఘటనలు ఎంతో మంది బ్రతుకును నాశనం చేశాయి కూడా. అలాంటి ఓ సంఘటన కారణంగా ఓ మహిళ 36 ఏళ్లుగా మగాడి వేషంలో బతుకుతోంది. తన కూతురి కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ మహిళ చెప్పుకొచ్చింది. ఈ విషయం బుల్లితెర డ్యాన్స్ షో అయిన ఢీ ద్వారా వెలుగులోకి వచ్చింది. గత 36 సంవత్సరాల క్రితం జరిగిన ఓ సంఘటన కారణంగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు మగాడి వేషంలో బతుకూ ఉంది పచ్చయమ్మాల్ అలియాస్ ముత్తూ మాస్టర్. కన్నీళ్లు తెప్పించే ఈ కథ గురించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఓ సంఘటన ఓ వ్యక్తి జీవితాన్ని మారుస్తుందా? అంటే దానికి రకరకాల ఆన్సర్స్ ఉంటాయి. కానీ సంఘటన గుండెలు పగిలేది అయితే కచ్చితంగా వ్యక్తిని మారుస్తుంది. తాజాగా అలాంటి సంఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 36 సంవత్సరాలుగా ఓ మహిళ మగాడి వేషంలో తిరుగుతూ.. ఈ సమాజంలో తన బతుకును వెళ్లదీస్తూ వస్తోంది. వింటుంటేనే కన్నీళ్లు వస్తున్న ఈ కథలోకి వెళితే.. తాజాగా ఢీ ప్రీమియర్ లీగ్ షోకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమోలో ఓ యోధురాలి గురించి ఈ ప్రపంచానికి తెలియజేశారు.
ఆమె పేరు పచ్చయమ్మాల్ అలియాస్ ముత్తు మాస్టర్. తన కుటుంబంలో వచ్చిన ఆర్థిక పరిస్థితుల కారణంగా బతుకుదెరువు కోసం పట్టణానికి వచ్చింది. కానీ అక్కడ ఓ లారీ డైవర్ తనతో నీచంగా ప్రవర్తించడంతో.. తనకు మహిళగా ఈ సమాజంలో భద్రత లేదు అనుకుంది. దాంతో ఓ గుడిలో గుండు కొట్టించుకుని, పూర్తిగా మగాడి వేషంలోకి మారిపోయింది. ఇలా ఉంటేనే ఈ సమాజంలో తాను బతకగలను అని ఒక నిర్ణయానికి వచ్చింది. తన కూతురి కష్టపడి పెంచింది. తనకు జరిగిన సంఘటన తన కూతురికి జరగకూడదు అని తల్లి తండ్రిగా మారి తన కూతురిని పెంచింది. ప్రస్తుతం ఈ ప్రపంచం ముందు ముత్తు మాస్టర్ గా నిలబడింది. ఈ కథ మెుత్తం చెప్పగానే ఢీ షో స్టేజ్ మెుత్తం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యింది. కంటెస్టెంట్స్ తో పాటుగా జడ్జీగా వ్యవహరిస్తున్న పూర్ణ కన్నీటి పర్యంతం అయ్యారు. ఆమే కాదు ఈ కథ విన్న ఎవరైనా కన్నీరు కార్చాల్సిందే. కాగా.. ముత్తు మాస్టర్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాక ఆగాలి.