Sekhar Master Brother Passed Away: కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Sekhar Master: కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం.. ఎమోషనల్‌ పోస్ట్‌ వైరల్‌

Sekhar Master Brother Passed Away: ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

Sekhar Master Brother Passed Away: ప్రముఖ టాలీవుడ్‌ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన చేసిన పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్‌ మాస్టర్‌. బుల్లి తెర మీద అనేక షోలకు జడ్జీగా వ్యవరిస్తూ.. ఇటు యూట్యూబ్‌లో కూడా షార్ట్‌ ఫిలిమ్స్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. అలానే పలువురు స్టార్‌ హీరోల సినిమాలకు కూడా కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం షోలు, సినిమాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు శేఖర్‌ మాస్టర్‌. ఇదిలా ఉండగా ఆయన ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. ఇక మూడు నెలల క్రితం అనగా.. ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా శేఖర్‌ మాస్టర్‌ ఇంట విషాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన వదిన మృతి చెందారు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తాజాగా శేఖర్‌ మాస్టర్‌ ఇంట మరో వ్యక్తి కన్ను మూయడం విషాదకరం. ఆ వివరాలు..

శేఖర్‌ మాస్టర్‌ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తమ్ముడు మృతి చెందారు. ఈ విషయాన్ని శేఖర్‌ మాస్టర్‌ తన ఇన్‌స్టా హ్యాండిల్‌ ద్వారార వెల్లడించారు. సోదరుడు చనిపోయిన విషయాన్ని వెల్లడిస్తూ.. ‘‘సుధా నిన్ను మిస్‌ అవుతున్నాం.. ఎక్కడికెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తుస్తోన్నావు. నువ్వు ఇక లేవు.. మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే చేదు నిజాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను. నువ్వు మాత్రం ఎక్కడో ఓ చోట ఆనందంగా ఉంటావని భావిస్తున్నాను. ఎప్పటికీ నువ్వు మాతోనే ఉంటావు. మిస్‌ యూ రా తమ్ముడు..’’ అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈమేరకు ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది.

శేఖర్ మాస్టర్ షేర్ చేసిన పోస్ట్ అందరినీ కలిచి వేస్తోంది. ప్రముఖ యాంకర్‌ అనసూయ దీనిపై స్పందిస్తూ.. ఆయనను ఓదార్చారు.. ధైర్యంగా ఉండాలని కోరారు. ఇక ఈ విషయం తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్నారు. అయితే తమ్ముడి మృతికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. ఇదిలా ఉంటే.. శేఖర్ మాస్టర్ ఇ​​క శేఖర్‌ మాస్టర్‌ ఢీ డ్యాన్స్‌ షో ద్వారా కొరియోగ్రాఫర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అల్లు అర్జున్‌, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్స్‌తో కలిసి పని చేశాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆయన వన్‌ ఆఫ్‌ ది టాప్‌ డ్యాన్స్‌ మాస్టర్‌గా కొనసాగుతున్నారు.

Show comments