Pic Talk: ఛత్రపతిలో సూరీడుగా నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ఛత్రపతిలో సూరీడుగా నటించిన పిల్లాడు ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా..?

ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన తొలి మూవీ ఛత్రపతి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. డార్లింగ్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇది. ఇందులో సూరీడు పాత్రలో నటించిన పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

ప్రభాస్- రాజమౌళి కాంబోలో వచ్చిన తొలి మూవీ ఛత్రపతి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. డార్లింగ్‌కు మాస్ ఇమేజ్ తెచ్చిన చిత్రం ఇది. ఇందులో సూరీడు పాత్రలో నటించిన పిల్లాడు.. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా..?

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, యంగ్ రెబల్ స్టార్ కాంబోలో మూడు చిత్రాలు వచ్చిన సంగతి విదితమే. అందులో తొలి ప్రాజెక్ట్ ఛత్రపతి. 2005లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రభాస్‌ను మాస్ ఎలివేషన్లలో చూపించిన సినిమా అది. తల్లి కోసం పరితపించిపోయే కొడుకుగా డార్లింగ్ నటన ఆసమ్. శ్రియ చరణ్ హీరోయిన్‌గా నటించింది. భానుప్రియ, షఫీ, ప్రదీప్ రావత్, అజయ్, కమల్ కామరాజ్, సుప్రీత్, వేణు మాధవ్, అనిత చౌదరి కీలక పాత్రలు పోషించారు. కామెడీ, యాక్షన్, సెంటిమెంట్ అన్నీ కళగలిపిన చిత్రమిది. ఈ సినిమాలో పాటలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. కీరవాణి అందిన మ్యూజిక్ అందించాడు. ఇందులో దివంగత నటి ఆర్తి అగర్వాల్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి విదితమే.

‘ఏ వచ్చి బీపై వాలే’, ‘గుండుసూది గుండుసూది’, ‘సుమ్మసూరియా’, ‘మన్నేలా తింటివిరా’ సాంగ్స్ ఇప్పటికి చార్ట్ బస్టర్లే. ఇక ఇందులో నటించిన అన్నీ పాత్రలకు తగిన గుర్తింపు లభించింది. ఈ సినిమాలో యాంకర్ అనితా చౌదరి, అతడి కుమారుడు సూరీడు క్యారెక్టర్ ఈ సినిమాను మలుపు తిప్పుతుంది. విలన్ (సుప్రీత్) వచ్చి తనతో పనికి రావాలంటూ సూరీడును పిలుస్తాడు. రాను అనడంతో పిల్లాడ్ని కొడతారు. ఆ పాత్రలో జీవించాడు పిల్లాడు. ఈ సన్నివేశం కోపంతో పాటు కన్నీరు తెప్పిస్తుంది. ఈ పాత్రలో నటించిన పిల్లాడు.. ఇప్పుడు ఎలా మారాడో తెలుసా..? అతడి పేరు భశ్వంత్ వంశీ. ఈ సినిమాలో కొద్దీ సేపు కనిపించినా.. సూరీడు పాత్ర ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మెదులుతూనే ఉంటుంది. సూరీడు పాత్ర కోసం రాజమౌళి సెలక్షన్ పెడితే.. భశ్వంత్ ఆడిషన్ కు వచ్చి సెలక్ట్ అయ్యాడు.

సూరీడు పాత్ర కోసం సరిగ్గా సరిపోతాడని భావించిన జక్కన్న అతడ్ని ఆ పాత్ర కోసం తీసుకున్నాడు. నిజంగానే దర్శకుడు అతడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు ఆ రోల్ అండ్ ఆ పిల్లాడు. ఇప్పుడు భశ్వంత్ ఎలా ఉన్నాడో తెలుసా.. గుర్తు పట్టలేని విధంగా మారిపోయాడు. గతంలో ఛత్రపతి సినిమాలో తన తల్లిగా నటించిన అనితా చౌదరి వద్దకు వెళ్లాడు. వీళ్లిద్దరూ దిగిన ఫోటోను అనితా చౌదరి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సూరీడు ఎంత పెద్ద వాడయ్యాడంటూ మాట్లాడుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ భశ్వంత్ అశోక్, యోగి, అందాల రాముడు, కేక, లైలా మజ్ను వంటి సినిమాలు చేశాడు. ఆయన తండ్రి దర్శకుడు దాసరి నారాయణ దగ్గర కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అలాగే  ఇప్పుడు ఓ యాక్టింగ్ స్కూల్లో ప్రొఫెసర్. యాక్టింగ్‌కు రెస్ట్ ఇచ్చి విదేశాల్లో చదువును పూర్తి చేసుకొని ప్రస్తుతం టాలీవుడ్‌లో అవకాశాల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది భశ్వంత్. ఇప్పుడు ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులంతా హీరో, హీరోయిన్లుగా వచ్చి ఇండస్ట్రీలో హిట్స్ అందుకుంటున్న సంగతి విదితమే. అతడు కూడా ఏదో ఒక సినిమాలో మెరవకపోతాడా వెయిట్ చేద్దాం.

Show comments