రేవ్ పార్టీ కేసులో నటి హేమకు నోటీసులు.. మరో 86 మందికి కూడా !

Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీలో పోలీసులు దూకుడు పెంచారు.. టాలీవుడ్ నటి హేమతో పాటు మరో 86 మందికి నోటీసులు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Bengaluru Rave Party: బెంగుళూరు రేవ్ పార్టీలో పోలీసులు దూకుడు పెంచారు.. టాలీవుడ్ నటి హేమతో పాటు మరో 86 మందికి నోటీసులు ఇవ్వడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

బెంగుళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో జీఆర్‌ ఫామ్ హౌజ్ లో జరిగిన రేవ్ పార్టీ దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. పుట్టిన రోజు పేరుతో లక్షలు ఖర్చుపెట్టి ఈ పార్టీ నిర్వహంచారు. ఈ పార్టీలో రాజకీయ, సినీ రంగానికి చెందిన వారితో సహా.. పలువురు మోడల్స్, పారిశ్రాకి వేత్తలు ఉన్నారు. బెంగుళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ రేవ్ పార్టీ కీలక సూత్రదారి విజయవాడ వాసి లంకపల్లి వాసుగా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే రేవ్ పార్టీలో ప్రముఖ నటి హేమ పాల్గొన్నట్లు వార్తలు రావడం.. తనకు పార్టీకీ ఏ సంబంధం లేదని ఆమె వీడియో  రిలీజ్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా నటి హేమకు నోటీసులు అందినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

బెంగుళూర్ రేవ్ పార్టీ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మురం చేస్తున్నారు. రేవ్ పార్టీలో బుక్ అయిన నటి హేమకు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు నోటీజులు జారీ చేశారు. హేమతో పాటు మరో 86 మందికి సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే వీరందరి రక్త నమూనాల్లో డ్రగ్స్ షాంపిల్స్ ఉండటంతో ఈ చర్యలకు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో విచారణకు రావాల్సిందే అని నోటీసులో పేర్కొన్నారు. హేమతో పాటు నటి ఆషిరాయ్, కాంతి, రిషి చౌదరి, ప్రసన్న, వరుణ్ చౌదరి, శివాని జైశ్వాల్, సుజాతలకు నోటీసులు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. బెంగుళూరు రేవ్ పార్టీ వార్త వచ్చినప్పటి నుంచి నటి హేమ చుట్టు ఎన్నో కథనాలు వస్తున్నాయి. మొదట తాను హైదరాబాద్ లో ఓ ఫామ్ హౌజ్ లో ఉన్నా అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది. పోలీసులు అదే స్పాట్ నుంచి హేమ ఫోటో రిలీజ్ చేశారు. రెండింటిలోనూ హేమ ఒకే డ్రెస్ వేసుకొని ఉంది.. ఆ తర్వాత బిర్యానీ వండుతూ తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది. అయితే హేమ తనను తాను పోలీసులకు కృష్ణ వేణిగా చెప్పడం వల్ల వాళ్లు కన్ఫ్యూజ్ అయినట్లు వార్తలు వచ్చాయి. అయితే అసలు పేరు హేమ అని తెలిసిందని పోలీసులు తెలిపారు. మరి ఇప్పుడు నోటీసుల విషయంలో హేమ ఎలా స్పందిస్తుందో అని వేచి చూడాలి.

Show comments