Shatrughan Sinha Hospitalized: ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నటుడు.. ఆందోళనలో అభిమానులు

ఆస్పత్రిలో చేరిన సీనియర్‌ నటుడు.. ఆందోళనలో అభిమానులు

Shatrughan Sinha: సీనియర్‌ నటుడు ఒకరు ఆస్పత్రిలో చేరారు. విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు..

Shatrughan Sinha: సీనియర్‌ నటుడు ఒకరు ఆస్పత్రిలో చేరారు. విషయం తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆ వివరాలు..

ఇండస్ట్రీలో ఈమధ్య కాలంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. కొందరు నటీనటులు అనారోగ్య సమస్యలతో మృత్యువాత పడితే.. మరి కొందరు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. సీనియర్‌ నటుడు ఒకరు ఆస్పత్రిలో చేరారు. విషయం తెలియడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఇక ఇదిలా ఉండగా.. సదరు నటుడి ఇంట శుభకార్యం జరిగి పట్టుమని వారం రోజుల కూడా కావడం లేదు. ఇంతలోనే ఇలా చోటు చేసుకోవడంతో.. ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంతకు ఎవరా నటడు.. ఆయనకు ఏమైంది అంటే..

ప్రముఖ బాలీవుడ్ సీనియర్‌ నటుడు శత్రుఘ్న సిన్హా ఆస్పత్రిలో చేరారు. నివేదికల ప్రకారం, శత్రుఘ్న సిన్హా ఇంట్లో సోఫాలో కూర్చున్నారు. దాని మీద నుంచి లేస్తుండగా ప్రమాదవశాత్తూ కింద పడిపోయారు. ఆ సందర్భంలో ఆయన పక్కటెముకకు గాయమైంది. ఈ ఘటన జరిగినప్పుడు సోనాక్షి సిన్హా కూడా ఇంట్లోనే ఉన్నారు. శత్రుఘ్న సిన్హా కిందపడటంతో వెంటనే ఆయనను కోకిలా బెన్‌ ఆస్పత్రికి తరలించారు. తమ అభిమాన నటుడు ఆస్పత్రిలో చేరాడని తెలియడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఇక శత్రుఘ్న సిన్హా ఆరోగ్యంపై వైద్యులు అప్‌డేట్‌ విడుదల చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని.. కాస్త జ్వరంతో నీరసంగా ఉన్నారని.. అభిమానులు ఆందోళన చెందవద్దని సూచించారు.

ఇక వారం రోజుల క్రితమే శత్రుఘ్న సిన్హా కుమార్తె, బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా వివాహం జరిగింది. నటుడు, ప్రియుడు జహీర్ ఇక్బాల్ పెళ్లి పీటలు ఎక్కారు. వీరిది లవ్‌ మ్యారేజ్‌ మాత్రమే కాక మతాంతర వివాహం. గత ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు తాజాగా పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు. ఈ వేడుకకు సోనాక్షి సోదరులు హాజరు కాలేదు. దాంతో ఆమె కుటుంబ సభ్యులకు వీరి పెళ్లి ఇష్టం లేదనే పుకార్లు వచ్చాయి. అంతేకాక సోనాక్షి సిన్హా తండ్రి శత్రుఘ్న సిన్హా వీరి పెళ్లికి ఒప్పుకోలేదని పుకార్లు షికార్లు చేశాయి.

అయితే ఆ వార్తలను శత్రుఘ్న సిన్హా తోసిపుచ్చారు. పెళ్లి అనేది ఒకరి వ్యక్తిగత విషయం అని.. వారి అభిప్రాయాలకు విలువ ఇస్తానని చెప్పుకొచ్చారు. తన కుమార్తె పెళ్లి పట్ల ఆయన సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సోనాక్షి వివాహం జరిగింది. వీరి రిసెప్షన్‌కు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇక 1969లో శత్రుఘ్న సినీరంగ ప్రవేశం చేశారు. మేరే అప్నే, కాళీచరణ్‌, విశ్వనాథ్‌, కాలాపత్థర్‌, దోస్తానా వంటి చిత్రాలతో స్టార్‌ అయ్యారు. ఆయన నట వారసురాలిగా సోనాక్షి సిన్హా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో శత్రుఘ్న సిన్హా పశ్చిమబెంగాల్‌లోని ఆసన్‌సోల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Show comments