Sumit Kadel, Rohit Jaiswal: కల్కి ఎఫెక్ట్.. సమోసా క్రిటిక్స్‌ సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్‌కి నోటీసులు!

Legal Notices To Bollywood Critics: ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించి ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ప్రచారం చేశారన్న ఆరోపణలు కారణంగా బాలీవుడ్ క్రిటిక్స్ కి కల్కి మేకర్స్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా మరోసారి ఈ క్రిటిక్స్ కి నోటీసులు వెళ్లాయి. అయితే..

Legal Notices To Bollywood Critics: ప్రభాస్ నటించిన కల్కి సినిమాకి సంబంధించి ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని ప్రచారం చేశారన్న ఆరోపణలు కారణంగా బాలీవుడ్ క్రిటిక్స్ కి కల్కి మేకర్స్ నోటీసులు పంపించారు. అయితే తాజాగా మరోసారి ఈ క్రిటిక్స్ కి నోటీసులు వెళ్లాయి. అయితే..

ప్రభాస్ కల్కి ఎఫెక్ట్ తో బాలీవుడ్ క్రిటిక్స్ కి దిమ్మ తిరిగే షాక్ ఎదురైంది. గతంలో కల్కి సినిమాకి సంబంధించి ఫేక్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని సర్క్యులేట్ చేశారన్న ఆరోపణలతో కల్కి 2898 ఏడీ చిత్ర నిర్మాతలు సుమిత్ కాడెల్ కి, రోహిత్ జైస్వాల్ లకి నోటీసులు పంపించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ బాలీవుడ్ హంగామా మీడియా కథనం రాసుకొచ్చింది. అయితే బాలీవుడ్ హంగామా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుందని సుమిత్ కాడెల్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా బాలీవుడ్ హంగామాకు లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీనికి సమాధానంగా బాలీవుడ్ హంగామా కూడా లీగల్ నోటీసులు పంపించింది. బాలీవుడ్ ఫిల్మ్ క్రిటిక్స్ సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ లకి బాలీవుడ్ హంగామా లీగల్ నోటీసులు పంపించింది. నీచమైన, దుర్మార్గమైన ట్వీట్స్ కి ప్రతిస్పందనగా 15 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేసింది. ఈ మేరకు హంగామా డిజిటల్ మీడియా ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ కంపెనీ ఎక్స్ ఖాతాలో ఒక ట్వీట్ చేసింది. లీగల్ నోటీసుని కూడా షేర్ చేసింది.

ఇదే విషయాన్ని బాలీవుడ్ హంగామా ఎక్స్ ఖాతాలో వెల్లడించింది. ప్రభాస్ మీద, కల్కి 2898 ఏడీ చిత్ర నిర్మాతల మీద పరువు భంగం కలిగించేలా ట్వీట్స్ చేసినందుకు సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ లకి కల్కి 2898 ఏడీ నిర్మాతలు 25 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారని ఎక్స్ క్లూజివ్ ట్వీట్ చేసింది. ఆగస్టు 3న బాలీవుడ్ హంగామా ఈ ట్వీట్ చేయగా సుమిత్ కాడెల్ రిప్లై ఇచ్చారు. ట్వీట్, ఆర్టికల్ ద్వారా తన ప్రతిష్టను దెబ్బతీయాలని, ఆర్థికంగా హాని కలిగించాలన్న ఉద్దేశంతో తనకు వ్యతిరేకంగా నకిలీ వార్తలు, హానికరమైన సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న బాలీవుడ్ హంగామాకి తాను నోటీసులు పంపానని ట్వీట్ చేశారు. ఈ నోటీసులో బాలీవుడ్ హంగామా నుంచి మా టీమ్ బహిరంగ క్షమాపణ కోరుతుందని అన్నారు. అలానే తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు పరిహారంగా కోటి రూపాయలు నష్టపరిహారం గడువు తేదీలోగా చెల్లించాలని లేదంటే కోర్టులో లీగల్ సూట్ ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

అయితే ఈ ట్వీట్ కి బాలీవుడ్ హంగామా స్పందిస్తూ.. ఇవాళ సుమిత్ కాడెల్ కి, అలానే రోహిత్ జైస్వాల్ కి లీగల్ నోటీసులు పంపించింది. ఈ లీగల్ నోటీసుల్లో సుమిత్ కాడెల్ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. సోషల్ మీడియా వేదికగా పబ్లిక్ ని సింపతీ క్రియేట్ చేసుకుని తమ కంపెనీ మీద బురద జల్లుతారని వెల్లడించింది. సుమిత్ కాడెల్, రోహిత్ జైస్వాల్ మీద తాము పబ్లిష్ చేసిన ట్వీట్ గానీ, కథనం గానీ ఖచ్చితంగా నిజమే అని.. నిజం అని నిర్ధారించుకున్న తర్వాతే పబ్లిష్ చేయడం జరిగిందని బాలీవుడ్ హంగామా నోటీసులో పేర్కొంది. బాలీవుడ్ హంగామాకి ఎంతో పేరు, ప్రఖ్యాతలు ఉన్నాయని.. ఫేక్ న్యూస్ లు రాయాల్సిన అవసరం లేదని తెలిపింది. అయితే బాలీవుడ్ హంగామా ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తుందని ఆరోపణలు చేసి కంపెనీ ప్రతిష్టకు భంగం కలిగించినందుకు గాను 15 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చెల్లించాలని నోటీసులో పేర్కొంది.        

Show comments