గత ఏడాది నాటునాటు. మరి.. ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏది?

గత ఏడాది నాటునాటు. మరి.. ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ ఏది?

ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి కోసం ఎన్నో పాటలు పోటీ పడుతున్నాయి.

ప్రస్తుతం ఆస్కార్ అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. అమెరికాలోని లాస్ ఏంజల్స్ లో ఈ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక ఈ వేడుకలలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి కోసం ఎన్నో పాటలు పోటీ పడుతున్నాయి.

ఏటా ఆస్కార్ అవార్డుల ఉత్సవాలు ఘనంగా జరుగుతూనే ఉంటాయి. అలాగే ప్రతి సారి ఆస్కార్ నామినేషన్స్ లో ఎన్నో చిత్రాలు పోటీ పడుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం ఈసారి ఆస్కార్ నామినేషన్స్ అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లో జరుగుతోంది. ఇప్పుడు జరుగుతున్న ఈ ఆస్కార్ నామినేషన్స్ లో తెలుగు సినిమాలు ఏవి లేనప్పటికీ.. తెలుగు సినీ ప్రియులు మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, అత్యుత్తమమైన ఆస్కార్ పురస్కారాన్ని దక్కించుకోవడం అంత సాధ్యం కాదు. కానీ, గత ఏడాది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో .. “ఆర్ ఆర్ ఆర్” ఆస్కార్ ను గెలుచుకుంది. మరి, ఈ సారి గెలిచింది ఎవరు? అనే ఆసక్తి అందరికి నెలకొంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజమౌళి దర్శకత్వంలో .. తారక్ , చరణ్ లతో మల్టీ స్టారర్ హీరోలుగా తెరకెక్కిన “ఆర్ ఆర్ ఆర్” చిత్రం.. క్రియేట్ చేసిన సెన్సేషన్ అంత ఇంత కాదు. ఆస్కార్ తో పాటు ఎన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ను ఈ సినిమా దక్కించుకుంది.ఇక గత ఏడాది “ఆర్ ఆర్ ఆర్” సినిమా ఆస్కార్ బరిలో నిలిచినపుడు.. ఎంతో మంది ఈ సినిమాకు ఒక్క ఆస్కార్ అయినా వస్తే.. బాగుంటుందని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇక అలానే అందరు బావించినట్లే.. ఈ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో “నాటు నాటు” సాంగ్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు దక్కింది. దీనికి ఎంతో మంది ఆనందం వ్యక్తం చేశారు. కానీ, ఈసారి ఆస్కార్ బరిలో ఇండియన్ ఫిలిమ్స్ ఏవి లేవు. కానీ, ఈ క్యాటగిరిలో ఈసారి ఏ సాంగ్ ఉండబోతుందా అనే ఆసక్తి మాత్రం అందరికి నెలకొంది.

ఈ ఏడాది ఆస్కార్ ఉత్సవాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు “ఓపెన్ హైమర్”. ఇక ఈ సినిమాతో పోటీ పడి.. బాక్స్ ఆఫీస్ వసూళ్లను వేల కోట్లలో కొల్లగొట్టిన మూవీ “బార్బీ”. ఈసారి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరిలో నిలిచిన సాంగ్ బార్బీ సినిమాలోని “వాట్ వస్ ఐ మేడ్ ఫర్” సాంగ్ . ఈసారి ఈ సాంగ్ కు ఆస్కార్ లభించింది. ఈ పాటను బిల్లీ ఏలిష్ పాడారు. ఇది ఒక మెలోడీ సాంగ్. నాటు నాటు సాంగ్ తో పోలిస్తే ఈ సాంగ్ కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. మరి, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నిలిచిన ఈ సాంగ్ పై .. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments