Sreela Majumdar Passed away: ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరోయిన్ మృతి

ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ హీరోయిన్ మృతి

ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. కారణాలే ఏవైనా.. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు చనిపోవడంతో అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఈ మద్య వరుసగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదాలు నెలకొంటున్న విషయం తెలిసిందే. కారణాలే ఏవైనా.. తాము ఎంతగానో అభిమానించే నటీనటులు చనిపోవడంతో అభిమానులు కన్నీటిపర్యంతం అవుతున్నారు.

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు తీవ్ర దిగ్బ్రాంతిని కలిగిస్తున్నాయి. నటీనటులు ఇతర సాంకేతిక రంగాని చెందిన వారు కన్నుమూయడంతో వారి కుటుంబాల్లో మాత్రమే కాదు.. అభిమానుల సైతం దుఖఃసాగరంలో మునిగిపోతున్నారు. హార్ట్ ఎటాక్, అనారోగ్య సమస్యలు, వయోభారం, రోడ్డు ప్రమాదాల.. ఇలా ఎన్నో కారణాల వల్ల సెలబ్రెటీలు కన్నుమూస్తున్న విషయం తెలిసిందే. గత నెల తమిళ స్టార్ హీరో విజయ్ కాంత్ కన్నుమూశారు. ఆ విషాదం మరువక ముందే..మరికొందరు కన్నుమూశారు.  సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లోనటించి అలరించిన దిగ్గజ నటి కన్నుమూసింది. వివరాల్లోకి వెళితే..

బెంగాలీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బెంగాలీ చిత్ర పరిశ్రమలో ఒకప్పుడు తన అందం, అభినయంతో కోట్ల మంది ప్రేక్షకుల మనసుదోచిన గొప్ప నటి శ్రీల మంజుదదార్ (65).   ఆమె 1980లో 16 ఏళ్ల వయసులోనే నటిగా కెరీర్ ప్రారంభించింది. తన అద్భుతమైన నటనతో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నారు శ్రీలా మజుందార్‌. నెల రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించడంతో కొన్నాళ్లు హాస్పిటల్ లో ఉంచడంతో కాస్త కోలుకున్నారు. ఈ క్రమంలోనే ఆమెను ఇంటికి తీసుకువచ్చారు కుటుంబ సభ్యులు. మళ్లీ ఆమె ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఇంట్లోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

దిగ్గజ దర్శకులు మృణాల్ సేన్-శ్రీల కాంబోలో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కాయి. ఆ చిత్రాలు బెంగాలీ ఇండస్ట్రీలో ఐకానిక్ గా నిలిచిపోయాయి. అకాలేర్ సందానే, ఏక్ దిన్ ప్రతిదిన్, కరీజ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. 1983 లో శ్యాబ్ బెనగల్ తీసిన మండి, 1985 లో ప్రకాష్ ఝా తెరకెక్కించిన దాముల్, ఉత్పలెందు చక్రవర్తి తీసిన చోక్ చిత్రాల్లో కీలక ప్రాత్లో నటించి మెప్పించారు శ్రీల. ఆమె మృతికి సంతాపంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ‘ఆమె ఒఖ శక్తి వంతమైన నటి, ఆమె నటించిన చిత్రాలు బెంగాల్ ఇండస్ట్రీలో ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి, ఇది బెంగాల్ చిత్ర పరిశ్రమకు పెద్ద నష్టం.. సినీ రంగానికి ఆమె చేసిన సేవలు ఎప్పటికీ మర్చిపోలేం, ఆమె కుటుంబానికి నా సానుభూతి’ అంటూ ట్విట్ చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు సెలబ్రెటీలు ఆమెకు నివాళులర్పించారు.

Show comments