Krishna Kowshik
Avika Gor.. బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు)లో ఆనంది పాత్రలో మెప్పించి.. అందరి మనస్సులను దోచుకున్న నటి అవికాగోర్. తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..
Avika Gor.. బాలిక వధు (చిన్నారి పెళ్లి కూతురు)లో ఆనంది పాత్రలో మెప్పించి.. అందరి మనస్సులను దోచుకున్న నటి అవికాగోర్. తెలుగు సినిమాతో హీరోయిన్ అయిన ఈ బ్యూటీ.. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె..
Krishna Kowshik
బుల్లితెరపై సందడి చేసిన డబ్బింగ్ సీరియల్స్‌లో ఒకటి చిన్నారి పెళ్లి కూతురు. ఆనంది పాత్రలో అవికా గోర్ యాక్షన్‌కు ఫిదా కాని వారుండరు. స్మాల్ అండ్ బిగ్ స్క్రీన్లపై చైల్డ్ ఆర్టిస్టుగా అలరించిన ఈ చిన్నది.. 15 ఏళ్లకే రాజ్ తరుణ్ హీరోగా వచ్చిన ఉయ్యాలా జంపాలా మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. సినిమాల, వెబ్ సిరీస్, సీరియల్స్‌లో బిజీ స్టారైంది అమ్మడు. ప్రస్తుతం బ్లడీ ఇష్క్ అనే హిందీ చిత్రంలో నటిస్తుంది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించాడు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జులై 26న నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో విడుదల కానుంది. అయితే తన చిరకాల మిత్రుడు, ప్రియుడు మిలింద్ చాంద్వానీతో రహస్య వివాహం చేసుకుందంటూ వార్తలు వచ్చాయి. కాగా, ఎట్టకేలకు వాటిపై ఓ పాడ్ కాస్ట్‌లో స్పందించింది అవికా.
మిలింద్.. అవికాగోర్ 2020లో తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఇద్దరు కలిసి చెట్టాపట్టాలేసుకుని కనిపించడంతో ఇద్దరికీ రహస్యంగా పెళ్లయ్యిందన్న రూమర్లు వచ్చాయి. దీనిపై స్పందించింది అవికా. ‘మిలింద్ , నేను 4 సంవత్సరాలుగా డేటింగ్‌లో ఉన్నాం. అతడు ఇండస్ట్రీకి చెందిన వాడు కాదు. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆరు నెలల పాటు స్నేహితులుగానే ఉన్నాం. అతడే నాకు మొదట ప్రపోజ్ చేశాడు. మా అభిప్రాయాలు ఒక్కటి కావడంతో ఓకే చెప్పాను. మా మనసులు కలిశాయి. మిలింద్ చాలా మంచి వాడు. నా దృష్టిలో మానసికంగా మా ఇద్దరికి పెళ్లైంది. ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకునేందుకు కూడా రెడీగానే ఉన్నాను. కానీ ఇద్దరి మధ్య వయస్సు చాలా వ్యత్యాసం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాలని మిలింద్ చెప్పాడు. అందుకే ఆలోచిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చింది.
బాలిక వధు సీరియల్ గురించి మాట్లాడుతూ.. తొలుత 80 ఎపిసోడ్ల వరకు అనుకున్నారని, కానీ 515 ఎపిసోడ్ల వరకు ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పింది. ఇక ఆమె సినిమాల విషయానికి వస్తే ఉయ్యాలా జంపాలా తర్వాత తెలుగులో లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజు గారి గది 3, నెట్, బ్రో, టెన్త్ క్లాస్ డైరీస్, థాంక్యూ, పాప్ కార్న్ వంటి చిత్రాలు చేసింది. పాప్ కార్న్ మూవీకి నిర్మాతగాను వ్యవహరించింది. అలాగే ఉమాపతి మూవీలోనూ అలరించింది. ఇవే కాకుండా హిందీ, కన్నడ చిత్రాల్లోనూ మెరిసింది. మాన్షన్ 24, వధువు వెబ్ సిరీస్‌లోనూ యాక్ట్ చేసింది. ఇప్పుడు బ్లడీ ఇష్క్ అనే ఓటీటీ మూవీతో రాబోతుంది.