Aditya N
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలో ఆగస్టు 15కు ఎంతో డిమాండ్ ఉంది. ఆరోజున సినిమాలను విడుదల చేసేందుకు మూవీ యూనిట్స్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాయి.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలో ఆగస్టు 15కు ఎంతో డిమాండ్ ఉంది. ఆరోజున సినిమాలను విడుదల చేసేందుకు మూవీ యూనిట్స్ ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తాయి.
Aditya N
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా పుష్ప 2. భారీ బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ సినిమా ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల వాయిదా పడిందని, డిసెంబర్ లేదా వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశం ఉందని కొన్ని పుకార్లు గత కొన్ని రోజులుగా వస్తూనే ఉన్నాయి. ఇక అదే విడుదల తేదీకి తమ సినిమాని విడుదల చేసేందుకు ఇతర సినిమా బృందాలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
నిజానికి పుష్ప 2 సినిమా విడుదలలో ఎటువంటి వాయిదా లేదు అని… అనుకున్నట్టు గానే ఆగస్టు 15వ తేదీనే విడుదల చేస్తాము అని నిర్మాతలు ఇది వరకే పలుమార్లు అధికారికంగా ప్రకటించారు. అయినప్పటికీ పుష్ప: ది రూల్ సినిమా విడుదల తేదీ పైన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఒకవేళ ఆగస్టు 15న పుష్ప 2 సినిమా విడుదల కాని పక్షంలో చాలా సినిమాలు విడుదల కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆగస్ట్ 15వ తేదీ అనేది భారత స్వాతంత్య్ర దినోత్సవం మాత్రమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించే సీజన్ గా కూడా పరిగణిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ సినీ పరిశ్రమలో ఈ డేట్‌కు ఎంతో డిమాండ్ ఉంది.
ఆగష్టు 15 వీకెండ్ విడుదల కోసం ప్రయత్నిస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్ దేవర కూడా ఉందట. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5 న విడుదల కావాల్సి ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కారణంగా వాయిదా పడింది. ఇక ఈ పాన్ ఇండియా చిత్రాన్ని కుదిరితే ఆగస్టు పదిహేనో తారీఖు లేదా దసరా పండుగ సందర్భంగా విడుదల చేయాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలుస్తోంది.
నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో వస్తున్న సరిపోదా శనివారం కూడా ఆగస్ట్ 15న వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది చూస్తుంది. అలాగే తమిళం నుంచి కమల్ హాసన్ ఇండియన్ 2తో పాటు, రజినీకాంత్ వెట్టైయాన్, సూర్య కంగువా సినిమాలు కూడా ఆగస్ట్ 15 పైనే దృష్టి పెట్టినట్లు సమాచారం అందుతోంది. ఇక బాలీవుడ్ నుంచి అజయ్ దేవగణ్ సింగం అగైన్ సైతం ఆగస్ట్ 15వ తేదీనే విడుదల కానుంది. నిజానికి అందరూ ఆగస్ట్ 15కా తేదీ విడుదల కోసం ప్రయత్నం చేయడం వెనుక కారణం లేకపోలేదు.
4 రోజుల వీకెండ్‌తో పాటు ఆగస్ట్ 19న రక్షా బంధన్, 26న జన్మాష్టమి ఉన్నాయి. ఇవన్నీ సినిమాల కలెక్షన్లకు మరింతగా దోహద పడతాయి. అందుకే ఆగస్టు పైనే అందరి చూపు పడింది. మరి పుష్ప 2 సినిమా విడుదల తేదీ వాయిదా పడుతుందా, అదే తేదీకి వేరే సినిమాలు విడుదల అవుతాయో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడక తప్పదు.