అంజలి మూవీలోని ఈ చైల్ట్ ఆర్టిస్ట్.. ఇప్పుడు నేషనల్ అవార్డ్.. ఎవరో గుర్తుపట్టారా..?

మణిరత్నం తెరకెక్కించిన చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం అంజలి. ఈ పిక్ అందులోనిదే. ఇందులో ఓ పిల్ల గ్యాంగ్ ఉంటుంది. దీనికి పెద్దగా వ్యవహరిస్తుంటాడు ఈ చిన్నోడు. ఇప్పుడు అతడు నేషనల్ విన్నర్ అని తెలుసా..?

మణిరత్నం తెరకెక్కించిన చిత్రాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న చిత్రం అంజలి. ఈ పిక్ అందులోనిదే. ఇందులో ఓ పిల్ల గ్యాంగ్ ఉంటుంది. దీనికి పెద్దగా వ్యవహరిస్తుంటాడు ఈ చిన్నోడు. ఇప్పుడు అతడు నేషనల్ విన్నర్ అని తెలుసా..?

కోలీవుడ్ లెజండరీ డైరెక్టర్లలో ఒకరైన మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పల్లవి అను పల్లవి నుండి పొన్నియన్ సెల్వన్ వరకు ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించాడు. పొలిటికల్, ఉగ్రవాదం, లవ్ అంటూ రొమాంటిక్, ఫ్యామిలీ డ్రామా, సోషియో ఫాంటసీ చిత్రాలను తెరకెక్కించడంలో ఆయనకే ఆయనే దిట్ట. చిన్న పిల్లలతో కూడా సినిమా తీసి హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన దర్శకుడు. మాయలు, మంత్రాలు కాకుండా సాధారణ కథను తీసి సక్సెస్ కొట్టాడు. అదే అంజలి. 1990లో వచ్చిన ఈ మూవీలో పేరుకు రేవతి, రఘువరన్ హీరో హీరోయిన్లయినప్పటికీ.. స్టోరీ మొత్తం బేబీ షామిలీ, తరుణ్, శృతి చుట్టూనే తిరుగుతుంది. ఇందులో వీరితో పాటు మరో పిల్లల గ్యాంగ్ కూడా ఉంటుంది. ఆ గ్యాంగ్‌కు లీడర్ గా వ్యవహరిస్తుంటాడు ఓ చిన్నోడు. ఇప్పడు ఆ పిల్లాడు నేషనల్ అవార్డు విన్నర్ అని తెలుసా..?

తాజాగా 70వ చలన చిత్ర జాతీయ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2022వ సంవత్సరంలో తెరకెక్కించిన చిత్రాలకు అవార్డులను ఎనౌన్స్ చేసింది. దేశ వ్యాప్తంగా 28 భాషల్లో విడుదలైన 300లకు పైగా చిత్రాల నుండి అందిన నామినేషన్లను 11 మందితో కూడిన జ్యూరీ పరిశీలించి ఈ అవార్డులు వెల్లడించింది. దక్షిణాది హీరో హీరోయిన్లు రిషబ్ శెట్టి, నిత్యా మీనన్ ఉత్తమ నటుడు, నటిగా నిలిచారు. అలాగే ఉత్తమ తెలుగు చిత్రంగా కార్తీకేయ 2 నిలిచింది. అలాగే మణిరత్నం పొన్నియిన్ సెల్వం 1కి కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ సంగీతం ఏఆర్ రెహమాన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ కేటగిరీలో రవి వర్మన్‌కు, అలాగే ఉత్తమ సౌండ్ డిజైనర్ కేటగిరీలో ఆనంద్ కృష్ణ మూర్తికి అవార్డులు లభించాయి. ఈ ఆనంద్ కృష్ణ మూర్తియే మనం చెప్పుకున్న ఆ పిల్లాడు.. చైల్ట్ ఆర్టిస్టు నుండి ఇప్పుడు సౌండ్ డిజైనర్‌గా ఎదిగాడు.

 

మణిరత్నం అంజలి మూవీలో చైల్ట్ ఆర్టిస్టుగా మారిన ఆనంద్ కృష్ణ మూర్తి. ఆ తర్వాత దళపతి, మే మదమ్, సతీ లీలావతి, ఆశై వంటి చిత్రాల్లో బాల నటుడిగా ఆకట్టుకున్నాడు. బక్క పల్చని శరీరంతో యాక్టింగ్ ఇరగదీశాడు. అలాగే పలు సీరియల్స్ చేశాడు. ఆ తర్వాత సినిమాలకు ఫుల్ స్టాఫ్ పెట్టి.. చదువులపై దృష్టి సారించాడు. ఎలక్ట్రానిక్ మీడియాలో ఎంఎస్సీ చేశాడు. ప్రముఖ దర్శకుడు బాలు మహేంద్ర దగ్గర శిష్యరికం చేశాడు. అలాగే యూనివర్శిటీ ఆఫ్ బ్రిస్టోల్ నుండి ఫిల్మ్, టెలివిజన్ ప్రొడక్షన్ చేశాడు. మర్మయోగితో సౌండ్ డిజైనర్‌గా కెరీర్ స్టార్ చేశాడు. కానీ ఆ మూవీ ఆగిపోయింది. ఆ తర్వాత 2009 నుండి కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాడు. సౌండ్ డిజైనర్, సౌండ్ ఎడిటర్‌గా ఎన్నో చిత్రాలకు పనిచేశాడు. మణిరత్నంతో చైల్ట్ ఆర్టిస్టుగా చేసిన ఆనంద్.. ఆయన సినిమాలకు సౌండ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఓ కాదల్ కన్మణి (ఓకే బంగారం), చెక్క చివంత వనమ్ (నవాబ్), నవరస, పొన్నియన్ సెల్వం, ఇప్పుడు థగ్ లైఫ్ చిత్రాలకు వర్క్ చేస్తున్నాడు.

Show comments