సినిమా ఇండస్ట్రీలో ఏ మూవీ హిట్ అవుతుంది.. ఏ సినిమా ఫ్లాప్ అవుతుందో కచ్చితంగా చెప్పలేం. అయితే సినిమా రిలీజ్ అయ్యి.. ఆ సినిమా డిజాస్టర్ అవుతే.. కొన్ని రోజుల తర్వాత హీరోలు, హీరోయిన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెబుతుంటారు ఆ మూవీ పోతుందని ముందే తెలుసు అని. ఇలాంటి వ్యాఖ్యలు ఇండస్ట్రీలో పెద్దదుమారాన్నే లేపుతుంటాయి. తాజాగా అలాంటి కామెంట్సే చేశాడు దేవరకొండ చిన్నోడు ఆనంద్ దేవరకొండ. లైగర్ సినిమా ప్లాప్ అన్న విషయం విజయ్ దేవరకొండకు ముందే తెలుసు అని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. ఆ తర్వాత గీతాగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో.. విజయ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక యూత్ లో విజయ్ ఫాలోయింగ్ అంతా ఇంత కాదు. మరీ ముఖ్యంగా అమ్మాయిల్లో విజయ్ కు క్రేజ్ కాసింత ఎక్కువనే చెప్పాలి. దాంతో అతడి నుంచి రాబోయే చిత్రాలకు భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో లైగర్ మూవీ చేశాడు విజయ్ దేవరకొండ. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ మూవీ డిజాస్టర్ గా మిగలడంతో.. విజయ్ ఫ్యాన్స్ నిరాశకు గురైయ్యారు.
అయితే ఈ సినిమా ప్లాప్ అవుతుందని విజయ్ దేవరకొండకు ముందే తెలుసని అతడి తమ్ముడు ఆనంద్ దేవరకొండ షాకింగ్ కామెంట్స్ చేశాడు. లైగర్ హిట్ అవ్వదని అన్నయ్యకు ముందే తెలుసు, అయినా అన్నయ్య కొద్దిగ కూడా బాధపడలేదు. లైగర్ రిలీజ్ రోజు సాయంత్రం నుండే ఖుషీ సినిమాపై దృష్టి పెట్టాడు అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. ఇక ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఖుషి సినిమాలో నటిస్తున్నాడు. అతడికి జోడీగా సమంత నటిస్తోంది. కాగా.. ఆనంద్ దేవరకొండ త్వరలోనే బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.