నాగార్జున హిట్‌ సాంగ్‌కు డ్యాన్స్‌ చేసిన అమల.. వీడియో వైరల్‌

సినిమా ఇండస్ట్రీలో పెళ్లి, విడాకులు చాలా కామన్‌ అయ్యాయి. చాలా కొద్ది మంది మాత్రమే తమ బంధాన్ని పది కాలాల పాటు పదిలంగా కాపాడుకుంటాయి. కారణాలు ఏవైనా సరే.. మనసులు కలవకపోతే.. విడిపోవడం అనేది పరిశ్రమలో చాలా చిన్న విషయం. ఇక టాలీవుడ్‌లో ఆదర్శ దంపతులు జాబితాలో ముందు వరుసలో ఉంటారు నాగార్జున-అమల. వీరద్దరూ తమ కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో కలిసి నటించారు. అయితే వారు ముందుగా వెండితెరపై జోడిగా నటించిన మొదటి సినిమా ‘కిరాయిదాదా’. ఆర్వాత వీళ్లిద్దరు తమ కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో జోడిగా నటించారు.

అలా వారి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో.. పెద్దలను ఒప్పించి.. వీరద్దరూ వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అమల సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు. కుటుంబ బాధ్యతలు, బ్లూ క్రాస్‌ పర్యవేక్షణ మాత్రమే కాక.. యాక్టింగ్‌ స్కూల్‌ బాధ్యతలు కూడా చూసుకుంటూ బిజీగా ఉన్నారు. కొన్నేళ్ల క్రితం సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించారు. ప్రస్తుతం సెలక్టెడ్‌గా సినిమాలు చేసుకుంటూ ముదుకు వెళ్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా అమల డ్యాన్స్‌ వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. నాగార్జున సూపర్‌ హిట్‌ సాంగ్‌కి డ్యాన్స్‌ చేశారు అమల. అన్నపూర్ణ ఫిల్మ్‌ కాలేజీలో జరిగిన ఓ వేడుకలో.. డ్యాన్స్‌తో అలరించారు అమల. నాగార్జున నటించిన హలో బ్రదర్‌ సినిమాలోని ప్రియ రాగాలే పాటకు ఆమె డ్యాన్స్‌ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజనులు.. మీ గ్రేస్‌, డ్యాన్సింగ్‌ స్కిల్స్‌ అద్భుతం మేడం.. అప్పుడెలా ఉన​ఆనరో.. ఇప్పటికి కూడా అంతే అందంగా ఉన్నారు అని కామెంట్స్‌ చేస్తున్నారు.

Show comments