Venkateswarlu
దాదాపు 20 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఆమె తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ లేదు..
దాదాపు 20 ఏళ్ల తర్వాత రేణు దేశాయ్ నటిగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఆమె తర్వాతి చిత్రంపై ఎలాంటి అప్‌డేట్ లేదు..
Venkateswarlu
చాలా కాలం తర్వాత సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు రేణు దేశాయ్. ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీలో ఓ కీలక పాత్ర చేశారు. లవణం హేమలతగా కనిపించారు. ఈ చిత్రం అక్టోబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ అయింది. అన్ని భాషల్లోనూ సినిమాకు మంచి స్పందన వచ్చింది. అంతేకాదు! రేణు దేశాయ్.. హేమలత పాత్రలో జీవించేశారు. చాలా ఏళ్ల తర్వాత రేణు దేశాయ్‌కి నటిగా మంచి గుర్తింపు వచ్చింది.
ఇక, అసలు విషయానికి వస్తే.. డిసెంబర్ 4వ తేదీన రేణు దేశాయ్ బర్త్‌డే వేడుకలు జరిగాయి. తల్లి పుట్టినరోజుకు అఖీరానందన్ అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్‌తో రేణు దేశాయ్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ గిఫ్ట్ ఏంటంటే.. తల్లి పుట్టిన రోజు గిఫ్ట్‌గా ఓ వీడియోను ఎడిట్ చేసి బహుమతిగా ఇచ్చాడు అఖీరా. రేణు, పవన్ కల్యాణ్ కలిసి నటించిన ‘ జానీ’ సినిమాలోని కొన్ని షాట్లను అందంగా కట్ ఎడిట్ చేశాడు. దానికి సప్త సాగరాలు దాటి సినిమాలోని ‘ కడలిని చేరే పరుగుగా..’’ అనే పాటను యాడ్ చేశాడు.
వీడియో అద్భుతంగా వచ్చింది. ఇక, ఆ వీడియోను రేణు దేశాయ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తల్లి పుట్టిన రోజుకు అఖీరా ఇచ్చిన గిఫ్ట్‌ను చూసి అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో వచ్చిన ‘బద్రీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యారు. తర్వాత తమిళంలో ‘జేమ్స్ పండు’ అనే చిత్రంలో నటించారు. 2003లో వచ్చిన జానీ సినిమా తర్వాత నటిగా పరిశ్రమకు దూరం అయ్యారు.
దాదాపు 20 తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’తో నటిగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. అయితే, ఈ 20 ఏళ్లలో చాలా క్రాఫ్ట్స్‌లో ఆమె తన సత్తా చాటారు. 2001లో వచ్చిన ఖుషీ సినిమాతో కాస్ట్యూమ్ డిజైనర్‌గా మారారు. జానీ, గుడుండా శంకర్, బాలు, అన్నవరం సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. ఖుషీ సినిమాలో ‘ ఏ మేరాజహా’.. బాలులోని ‘హట్ హట్‌జా’ అనే పాటలకు ఎడిటర్‌గా కూడా పని చేశారు. 2012లో వచ్చిన ‘ మంగళస్తక్ వన్స్ మోర్’, 2012లో వచ్చిన ఇస్క్ వాలా లవ్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇస్క్ వాలా లవ్ సినిమాకు స్వయంగా ఆమే దర్శకత్వం వహించారు. మరి, రేణు దేశాయ్ బర్త్‌డేకు ఆఖీరా ఇచ్చిన గిఫ్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.