Dharani
టాలీవుడ్ హీరోయిన్ ఒకరు స్నేహితుడి చేతిలో భారీగా మోసపోయింది. ఏకంగా 4 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. ఆ వివరాలు..
టాలీవుడ్ హీరోయిన్ ఒకరు స్నేహితుడి చేతిలో భారీగా మోసపోయింది. ఏకంగా 4 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయింది. ఆ వివరాలు..
Dharani
మోసం చేయడం తప్పు కాదు.. మోసపోవడం తప్పు అంటారు పెద్దలు. కానీ కొన్ని రకాల మోసాలను మనం గుర్తించలేము. ఎందుకంటే.. మనం ఎంతో నమ్మి, కుటుంబ సభ్యులుగా భావించిన వారు.. మన కోసం ప్రాణం ఇస్తారు అని ఎవరి గురించి అనుకుంటామో.. వారే మనల్ని మోసం చేస్తారు. ఇక నేటి కాలంలో సైబర్ మోసగాళ్లు ఎంతలా బరి తెగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. డెలివరీ, ఓటీపీ, లక్కీ డ్రా.. ఇలా పేర్లు మార్చి జనాలను ఏమారుస్తున్నారు. ఇలా మోసపోతున్న వారిలో సామాన్యులు, నిరక్షరాస్యులు మాత్రమే కాక.. సెలబ్రిటీలు, ఐటీ ఉద్యోగులు, గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసే వారు సైతం ఉండటం గమనార్హం. ఈ క్రమంలో తాజాగా ఈ తరహాకు చెందిన మరో సంఘటన వెలుగు చూసింది. టాలీవుడ్ హీరోయిన్ ఒకరు ఏకంగా 4 కోట్ల రూపాయల వరకు మోసపోయారు. ఆ వివరాలు..
స్నేహితుడని నమ్మినందుకు.. తనను నిలువునా మోసం చేశాడని.. ఏకంగా రూ.4.14 కోట్లు తీసుకుని చెక్కేశాడని వాపోయింది టాలీవుడ్ హీరోయిన్ రిమి సేన్. మాయమాటలు చెప్పి.. నమ్మకంగా ఉంటూ.. తన కుటుంబానికి ఎంతో దగ్గరైనా వ్యక్తి.. చివరకు తనను అత్యంత దారుణంగా మోసం చేశాడని చెప్పుకొచ్చింది. ఇంతకు ఆమెని మోసం చేసింది ఎవరంటే రోనక్ వ్యాస్. ఇక రెండేళ్ల క్రితం పోలీసులకు అతడిపై ఫిర్యాదు చేసింది రిమి సేన్. తాజాగా ఈ కేసు సీఐడీకి బదిలీ అయ్యింది.
ఈ సందర్భంగా రిమిసేన్ మాట్లాడుతూ.. ‘‘నాలుగేళ్ల క్రితం జిమ్‌లో రోనక్‌ను కలిశాను. నాతో ఫ్రెండిషిప్ చేశాడు. మేం మంచి స్నేహితులం అయ్యాం. కానీ అతడు నన్ను మోసం చేశాడు. నన్నే కాదు.. అహ్మదాబాద్‌లోనూ ఇలాగే చాలామందిని మోసం చేశాడని విన్నాను. తను నా ఇంటికి కూడా వచ్చేవాడు. మా అమ్మతో చాలా కలిసి పోయాడు. ఆమెతో కలిసి భోజనం చేసేవాడు. అంత క్లోజ్‌గా ఉన్న వ్యక్తి తర్వాత సడన్‌గా ప్లేటు తిప్పేశాడు. అధిక వడ్డీ అని చెప్పి నా దగ్గరి నుంచి రూ.20 లక్షలు తీసుకున్నాడు. ప్రారంభంలో దానిపై తొమ్మిది శాతం వడ్డీ ఇచ్చేవాడు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘కొన్ని నెలల పాటు ఇలానే సాగింది. ఆ తర్వాత తనకు మరింత డబ్బు ఇస్తే.. దానిపై 12- 15 శాతం వడ్డీ తీసుకొస్తానన్నాడు. అలా రూ.4.14 కోట్లు ఇచ్చాను. మొదటి నెల ఐదారు లక్షలు చేతికిచ్చాడు. తర్వాత వాళ్ల నాన్నకు కరోనా వచ్చిందని, డబ్బులు ఇవ్వలేనని చెప్పేసరికి నమ్మేశాను. నెలల తరబడి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవాడు. ఆ తర్వాత నాకు మెల్లగా అర్థం అయ్యింది. ఇదంతా ఓ పెద్ద స్కామ్ అని. ఏడాదిన్నర క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఇప్పుడా కేసు సీఐడీకి బదిలీ అయినట్లు ఫోన్ వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది.
‘‘కేసు త్వరితగతిన విచారణ చేపట్టాలని హైకోర్టులో పిటిషన్ వేశాను. బహుశా రెండు రోజుల్లో రోనక్‌పై అరెస్ట్ వారంట్ జారీ చేస్తారు. నాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. వడ్డీతో సహా నాకు రూ.14 కోట్లు రావాల్సి ఉంది. పోలీసులకు లొంగిపోయుంటే నేను కేవలం ఇచ్చిన అసలు మాత్రమే తీసుకుని వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు కనిపించకుండా పారిపోయాడు.. కాబట్టి నేను ఎంతదూరమైనా వెళ్తాను’’ అని రిమి సేన్ చెప్పుకొచ్చింది. కాగా రిమి సేన్.. నీ తోడు కావాలి, అందరివాడు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది.