Nagendra Kumar
Jayasudha Son Entry as Hero: టాలీవుడ్ సహజనటిగా జయసుధ కొడుకు నిహిర్ కపూర్ హీరోగా ఎల్లుండి పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Jayasudha Son Entry as Hero: టాలీవుడ్ సహజనటిగా జయసుధ కొడుకు నిహిర్ కపూర్ హీరోగా ఎల్లుండి పాన్ ఇండియా రేంజ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Nagendra Kumar
సహజనటిగా ఓ రేంజ్ లో నేమ్ అండ్ ఫేం సంపాదించుకున్న జయసుధ కొడుకు నిహిర్ కపూర్ ఎల్లుండి పాన్ ఇండియా రేంజ్ లో ప్రముఖ నిర్మాత చదలవాడడ శ్రీనివాసరావు నిర్మించి, దర్శకత్వం వహించిన రికార్డు బ్రేక్ సినిమాలో ఓ మంచి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ పాత్ర తనకి చాలా మంచి పేరు తెస్తుందని, ఆఫర్లు కూడా వస్తాయన్న నమ్మకం తనకుందని గట్టిగా చెబుతున్నాడు. డైరెక్షన్ వింగ్ లో కూడా ట్రైనింగ్ పొందిన నిహిర్ ప్రస్తుతం నటన మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడు. జయసుథ కొడుకు కాబట్టి కొంత పాప్యులారిటీ వచ్చే మాట వాస్తవమే అయినా కూడా తనదైన మార్క్ అండ్ స్పార్క్ కావాల్సినంత పేలితేనే గానీ స్వంత బ్రాండింగ్ రానేరాదు.
రికార్డు బ్రేక్ అనుకున్నట్టు హిట్ అయితే కొంతవరకూ మేలు జరుగుతుంది నిహిర్ కి. హిట్ సినిమాలో నటించినందుకు కొన్ని మార్కులు పడతాయి. నిహిర్ ఎలా చేశాడు, ఎంత చేయగలిగాడు అన్న విశ్లేషణలు ప్రారంభమవుతాయి. ఇక్కడే నిహిర్ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం ఖాయం,. జయసుథ కొడుకు అన్నది నిహిర్ పెద్ద బ్యాగేజ్. బాగా చేశాడని పేరొస్తే ఎంతైనా జయసుథ జీన్స్ వచ్చాయని మెచ్చుకుంటారు. లేదా గుంపులో గోవిందా అని కొట్టుకుపోతాడు. కానీ నిహిర్ విషయంలో తన పర్సనాలిటీ తనకి పెద్ద ప్లస్ పాయంట్. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ కి చేరుకున్న తెలుగు సినిమాకి నిహిర్ లాంటి పర్సనాలిటీలు ఎంతో అవసరం. హిందీ బ్రహ్మాండంగా మాట్లాడగలిగే నిహిర్ తన పర్సనాలిటీ ప్లస్ తో గట్టి ఫైటే ఇవ్వగలడన్న పరిశ్రమలో చాలా మందిలో ఉంది.
రికార్డు బ్రేక్ సినిమాలో దర్శకుడిగా చదలవాడ శ్రీనివాసరావు అవకాశమిచ్చిందే గ్యాంగస్టర్ గంగరాజులో నిహిర్ పెరఫార్మింగ్ ఎబిలిటీని గుర్తించి. సో…కొన్ని పాయంట్స్ నిహిర్ స్కోర్ చేశాడు ఆల్రెడీ. కానీ ఇప్పుడు రాబోతున్న రికార్డు బ్రేక్ సినిమాని చదలవాడ ఛాలెంజ్ గా తీసుకుని మరీ చేస్తున్నది. ఇందులో హీరో కాకపోయినా కూడా క్యారెక్టర్ మంచిదనే నిహిర్ కూడా చేయడానికి సిద్ధపడ్డాడు. హిట్ అయితే అందరూ సొంతం చేసుకుంటారు. ఆ మేరకు నిహిర్ స్కోర్ నిహిర్ దే అవుతుంది. అడవిలో అనాధలుగా పెరిగిన కవలపిల్లలలో నిహిర్ ఒకడు. కుస్తీపోటీలలో తర్ఫీదు పొంది ప్రపంచస్థాయి పోటీలవరకూ వెళ్ళడమే ఈ కథలో స్పెషల్ పాయంట్. దాదాపు దంగల్ కాన్సెప్టే. పోస్టర్లు చూస్తే లగాన్ ఇమిటేషన్ కనిపిస్తోంది. డైరెక్షన్ వైపు వెళ్ళడం ఎప్పుడు అనడిగితే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడు. కథ కూడా రెడీ చేసుకున్నానని, ఓటిటికి, ధియేట్రికల్ కి కూడా సరిపోయినట్టుగా కథ తయారుచేసుకున్నానని చెబుతూ త్వరలోనే మెగాఫోన్ పట్టుకోబోతున్నట్టు కాన్ఫిడెంట్ గా నిహిర్ చెప్పాడు.