Amala Paul: ప్రెగ్నెన్సీ ప్రకటించిన నటి అమలాపాల్‌! ఫోటోలు వైరల్

తెలుగు ఇండస్ట్రీలో మాలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు ఇండస్ట్రీలో మాలీవుడ్ బ్యూటీ అమలాపాల్ ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో ఎంట్రీ ఇచ్చి.. వరుసగా స్టార్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది.

తమిళ, మలయాళ ఇండస్ట్రీ నుంచి తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించారు. అలాంటి వారిలో అమలాపాల్ ఒకరు. ప్రముఖ మాలీవుడ్ దర్శకులు లాల్ జోస్ తెరకెక్కించిన నీల తామరలో చిన్న పాత్రతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్. ఆ తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా పేరు తీసుకురాకపోయినా.. ‘మైనా’ చిత్రం అమలాపాల్ కి మంచి పేరు తీసుకురావడమే కాదు.. వరుసగా అవకాశాలు వెల్లువెత్తాయి. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకుంది. నటిగా ఆమెకు ఎంతో క్రేజ్ వచ్చిందో.. కాంట్రవర్సీల్లో కూడా అదే రేంజ్ లో వచ్చాయి. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత ద్వితీయ వివాహం చేసుకుంది. తాజాగా ఫ్యాన్స్ కి అమలాపాల్ గుడ్ న్యూస్ చెప్పింది. వివరాల్లోకి వెళితే..

బాలాజీ మోహన్ దర్శకత్వం లో హీరో సిద్దార్ధ్ సరసన ‘లవ్ ఫెయిల్యూర్’ మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది అమలా పాల్. తర్వాత  రామ్ చరణ్ నటించిన నాయక్ చిత్రంలో హీరోయిన్   అమలాపాల్. ప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘ఇద్దరమ్మాయిలు’ చిత్రంతో టాలీవుడ్ లో తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. తర్వాత పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు 2014 లో దర్శకుడు విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. నటుడు జగత్ దేశాయ్ ని 2023 లో ద్వితీయ వివాహం చేసుకుంది. ప్రస్తుతం మూవీస్, వెబ్ సీరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది. తాజాగా అమలాపాల్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తాను తల్లిని కాబోతున్నట్టు ఇన్‌స్ట్రాగ్రామ్‌ ద్వారా చెప్పింది. 1+1=3 అంటూ ఫన్నీగా ఇన్ స్ట్రాలో రాసుకొచ్చింది.

వెండితెరపై తనకు ఎంత క్రేజ్ ఉన్నా.. రియల్ లైఫ్ లో ఇబ్బందులు ఎదుర్కొంది. దర్శకుడు విజయ్ ని పెళ్లాడి విడాకులు ఇవ్వడంతో ఆమెపై రక రకాల రూమర్లు పుట్టుకు వచ్చాయి. తనపై వచ్చిన విమర్శలు తిప్పి కొట్టింది.. అదే సమయంలో జగత్ దేశాయ్ అనే ఈవెంట్ మేనేజర్ ని ప్రేమించి కొంతకాలం సహజీవనం చేసిన ఆమె ఇతడే నా ప్రియుడు అంటు సోషల్ మీడియాలో అభిమానులకు పరిచయం చేసింది. పదిరోజుల్లోనే అభిమానులకు మరో షాక్ ఇచ్చింది..ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకోవడంతో నెటిజన్లు రక రకాలుగా స్పందించారు. తాజాగా అమలాపాల్ తన ప్రెగ్నెన్సిని చూపిస్తూ పలు ఆసక్తికరమైన ఫోటోలు పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Show comments