ఇండస్ట్రీలో పాన్ ఇండియా అనే పదం బాహుబలి తర్వాత ఎక్కువగా వింటున్నాం. అంతకుముందు డబ్బింగ్ రూపంలో వేరే సినిమాలు వచ్చినా.. డబ్బింగ్ సినిమాలుగానే చెప్పుకునే వాళ్లు. కానీ.. ఇప్పుడు ఒక సినిమా వివిధ భాషల్లో రిలీజ్ అవుతుందంటే.. దానికి పాన్ ఇండియా అనే ట్యాగ్ తగిలించేస్తున్నారు. ఒకవేళ మూవీ రెండు భాషలలో రిలీజ్ అయితే.. ద్విభాషా చిత్రం అని, మూడు భాషలైతే త్రిభాష అని పేర్లు పెట్టేస్తున్నారు. ఒకప్పుడు ఎన్ని వచ్చినా అన్ని డబ్బింగ్ సినిమాలే. ఎందుకంటే అది మన భాషలో తీయలేదు కాబట్టి. కానీ.. పాన్ ఇండియా అనే ట్రెండ్ వచ్చాక.. సినీ మార్కెట్స్ రూపురేఖలు మారిపోయాయి. దీంతో తెరపైకి కొత్త కొత్త కాంబినేషన్స్ వస్తున్నాయి.
ఇదివరకు బాలీవుడ్ లో బాలీవుడ్ హీరోలే ఉండేవారు. ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్ తెలుగు హీరోలతో.. తెలుగు డైరెక్టర్ తమిళ హీరోలతో.. కన్నడ వారు తెలుగు వారితో సినిమాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు లాంగ్వేజ్ బ్యారియర్స్ అనే మాట పోయిందని చెప్పాలి. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా పాన్ ఇండియా సినిమాలు క్రేజీ కాంబినేషన్స్ లో రూపొందుతున్నాయి. ప్రభాస్ తో ప్రశాంత్ నీల్, రామ్ చరణ్ తో శంకర్.. ఇలా ఇప్పుడు ఇదే బాటలో టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను.. తమిళ స్టార్ హీరో సూర్య కాంబినేషన్ సెట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సూర్య హీరోగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
ఇప్పటికైతే వీరి కాంబో ప్రాజెక్ట్ పై ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కానీ.. టాక్స్ అయితే నడుస్తున్నాయట. ఒకవేళ సెట్ అయితే మాత్రం ఓ ఊరమాస్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయినట్లే. ఎందుకంటే.. సింగం సిరీస్ తో సూర్యకు మాస్ ఇమేజ్ చాలా ఏర్పడింది. గతేడాది రోలెక్స్ గాను బాక్సాఫీస్ వద్ద రచ్చ చేశాడు. దీంతో ఇప్పుడు బోయపాటితో సెట్ అయితే ఆ కిక్కే వేరని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం వీరిద్దరూ చేస్తున్న సినిమాలతో బిజీగా ఉన్నారు. హీరో సూర్య కంగువ అనే పాన్ ఇండియా మూవీ చేస్తుండగా.. డైరెక్టర్ బోయపాటి హీరో రామ్ తో స్కంద తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది. మరి సూర్య – బోయపాటిల కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.