Abhishek Agarwal: అభిషేక్ అగర్వాల్ కు ప్రత్యేక గౌరవ అహ్వానం

అభిషేక్ అగర్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలో జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు.

అభిషేక్ అగర్వాల్ కు అరుదైన గౌరవం దక్కింది. అయోధ్యలో జరగనున్న ప్రతిష్టాపన కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్నారు.

జనవరి 22న అయోధ్యలో జరుగనున్నరామవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీదే ఒక సంచలన ఘట్టంగా నమోదైంది. దశాబ్దాల పోరాటం, దీక్షలకు ఫలితంగా చోటు చేసుకోబోతున్న ఈ సుందర ఘట్టం భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం లభించిన 1947 ఆగష్టు పదిహేను తర్వాత.. మళ్ళీ అంతటి, అంతకన్నా చరితార్ధతను సాధించిన రోజు. భారతీయుల, ముఖ్యంగా హిందూ దేశంగా కీర్తి పొందిన మన హిందూ దేశంలో జనవరి 22, 2024 తేదీ సువర్ణాక్షరాలతో లిఖించతగిన రోజుగా చిరస్థాయిగా నిలిచి వెలుగుతుంది.

ఈ ఘనమైన ఉత్సవ కార్యక్రమానికి దేశం మొత్తం మీద హాజరయ్యే వారి సంఖ్య కేవలం 2000 మంది మాత్రమే. అంటే అందరూ లబ్ద ప్రతిష్టులు, విశిష్టమైన చరిత్ర కలిగినవారు మాత్రమే ఈ కార్యక్రమంలో నేరుగా పాల్గొనే మహదావకాశాన్ని అందుకున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకమైనది కాబట్టి, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ, పటిష్టమైన రక్షణ సిబ్బంది నియంత్రణలో మాత్రమే జరుగుతుంది. అటువంటి మహోన్నతమైన కార్యక్రమానికి తెలుగు చిత్ర పరిశ్రమనుంచి హాజరవుతున్న ప్రతిష్టాత్మక వ్యక్తులలో త్రిబుల్ ఏ బ్యానర్ అధినేత, కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ టు, ఏప్రిల్ నెలలో విడుదల కాబోతూ రామ్ చరణ్ తో  కలసి సంయుక్తంగా ధి ఇండియా హౌస్ అనే భారత స్వాతంత్ర్య సమరగాథకు సంబంధించిన చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత అబిషేక్ అగర్వాల్ కు ఆహ్వానం లభించింది.

కేవలం కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2లాటి సినిమాలు నిర్మించిన నిర్మాతగా అభిషేక్ ఇప్పటికే పేరు మోసిన వ్యక్తిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో సమున్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇదే గాక, సనాతన దర్మాన్ని కాచి, కాపాడి, సంరక్షించే విధి నిర్వహణలో కూడా అబిషేక్ అగర్వాల్ పేరుకి ఓ ప్రత్యేకమైన విలువ ఉంది. ఈ నేపథ్యంలోనే రామవిగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి రమ్మని, ప్రత్యేక అతిధిగా అభిషేక్ అగర్వాల్ ను కార్యక్రమ నిర్వాహక కమిటీ ముఖ్య సభ్యులు వ్యక్తిగతంగా కలసి ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమానికి హాజరుకావడం, అందుకు తనకు గౌరవ అహ్వానం లభించడం తన పూర్వజన్మపుణ్యమని అబిషేక్ అభివర్ణించారు.

Show comments