Dharani
90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఆదిత్య పాత్రలో నటించిన రోహన్ రాయ్.. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌లో ఆదిత్య పాత్రలో నటించిన రోహన్ రాయ్.. తాజాగా తనలోని మరో టాలెంట్‌ని బయటపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
Dharani
ఓటీటీ ప్లాట్ ఫామ్‌ల హవా పెరిగిన తర్వాత.. వెండి తెర మీద కనిపించే కంటెంట్ తీరు కూడా మారింది. కొత్త కథలు మాత్రమే కాక నూతన నటీనటులు కూడా పరిచయం అవుతున్నారు. అలానే టాప్ స్టార్స్ సైతం.. మంచి కంటెంట్ ఉంటే వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. నేటి కాలంలో సినిమాలతో సమానంగా వెబ్‌సిరీస్‌లు క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. అలా ఈమధ్యకాలంలో ఓటీటీల్లో వచ్చి.. విపరీతమైన ఆదరణ పొందుతున్న వెబ్ సిరీస్ 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్. సీనియర్ హీరో శివాజీ, వాసుకీ, మౌళి, రోహన్, దివ్య కీలక పాత్రల్లో నటించిన ఈ సిరీస్‌కు మంచి ఆదరణ లభిస్తుంది. ఈటీవీ విన్‌లో విడుదలైన ఈ వెబ్ సిరీస్ మంచి టాక్‌తో దూసుకుపోతుంది.
ఈవెబ్‌సిరీస్‌లో శివాజీ, వాసుకీతో పాటు అందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఈక్రమంలో 90స్ వెబ్ సిరీస్‌లో ఆదిత్య పాత్రలో నటించి.. ప్రేక్షకులను నవ్వించడమే కాక.. సెంటిమెంట్ సీన్లలో తన నటనతో అందరిని ఏడిపించాడు రోహన్ రాయ్. సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న రోహన్ రాయ్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్‌తో వెబ్ సిరీస్‌లలోకి కూడా ప్రవేశించాడు. దీనిలో పండిత పుత్రహాః పరమ సుంఠహాః అన్న సామెతకు ఆదిత్య ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తాడు. చదువుల్లో చాలా వీక్ అయిన ఆదిత్య పాత్రలో రోహన్ ఒదిగిపోయి నటించాడు.
ఈ క్రమంలో తాజాగా రోహన్ రాయ్‌ని ఇంటర్వ్యూ చేసింది ఐడ్రీమ్ మీడియా. ఈసందర్భంగా హిందీలో అనర్గళంగా డైలాగ్ చెప్పి.. ప్రేక్షకులు చేత ఔరా అనిపించుకున్నాడు. రెండు నిమిషాల పాటు హిందీ, ఇంగ్లీష్‌లో గుక్కతిప్పుకోకుండా డైలాగ్స్ చెప్పి.. అందరిని ఆశ్చర్యపరిచాడు. నవీన్ పొలిశెట్టి నటించిన ఓ షార్ట్ ఫిల్మ్‌లోని డైలాగ్ చెప్పి.. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలు పొందుతున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారగా.. రోహన్ టాలెంట్ చూసిన నెటిజనులు.. అతడిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ బుడ్డోడికి మంచి భవిష్యత్తు ఉందని పొగుడుతున్నారు. మీరు కూడా వీడియోని చూసి.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
God gifted child..Em cheppav ra babu @NaveenPolishety dialogue from #Chichorepic.twitter.com/HZ8RRFfe6Z
— R a J i V (@RajivAluri) January 10, 2024