Why Women More Cry: మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తారు! దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తారు! దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఇవే..

అబ్బాయిలతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా ఏడుస్తారు. ప్రతీ చిన్న విషయానికి వాళ్లకు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. అయితే ఇలా జరగడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. 

అబ్బాయిలతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా ఏడుస్తారు. ప్రతీ చిన్న విషయానికి వాళ్లకు ఏడుపు వెంటనే వచ్చేస్తుంది. అయితే ఇలా జరగడానికి శాస్త్రీయ కారణాలు ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. 

ఏడ్చే మగాడ్ని, నవ్వే ఆడదాన్ని నమ్మకూడదని అంటారు. మగాడికి కష్టాలు ఉండవా? వాడు మాత్రం మనిషి కాదా? అయినా సరే ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు అని అంటారు. ఇలా ఎందుకు అంటారంటే.. మగాడు ఎంత బాధ ఉన్నా లోపలే దాచుకుని పైకి నవ్వుతా ఉంటాడు కాబట్టి. మగాడు ఏడ్చే పరిస్థితి చాలా తక్కువ కాబట్టి. అందుకే ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు అని అనుంటారు. ఇక అమ్మాయి ప్రతి చిన్న విషయానికి ఏడుస్తుంది కాబట్టి ఆమె నవ్వితే నమ్మకూడదు అని అనుంటారు. ఏదైతేనేం.. మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా ఏడుస్తారు అని ఒక క్లారిటీ అయితే వచ్చింది. అసలు మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ ఏడవడానికి కారణం ఏంటి? దీని వెనుకున్న సైంటిఫిక్ రీజన్స్ ఏంటి?

కొన్ని దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు, అధ్యయనాలు చేయగా మగాళ్ల కంటే ఆడవాళ్లే ఎక్కువ ఏడుస్తారని తేలింది. 1980ల టైంలో బయోకెమిస్ట్, పీహెచ్డీ స్కాలర్ అయిన విలియం హెచ్. ఫ్రెయ్ అనే వ్యక్తి పరిశోధనల ప్రకారం.. ఆడవాళ్లు ఒక నెలలో సగటున 5 సార్లు ఏడిస్తే.. మగాళ్లు మాత్రం ఒకే ఒక్కసారి ఏడుస్తారట. అది కూడా చాలా రేర్ అని తేలింది. కంటతడి పెట్టుకోవడం లేదా బోరున ఏడవడం గానీ మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లలోనే ఎక్కువగా ఉంటుందట. అప్పట్లో ఈయన చెప్పింది రీసెంట్ టైంలో చేసిన చాలా అధ్యయనాల్లో నిజమని తేలింది. లారెన్ బిల్స్మా అనే పీహెచ్డీ చేసిన వ్యక్తి కూడా.. మగాళ్ల కంటే అమ్మాయిలే ఎక్కువగా ఏడుస్తారని తన పరిశోధనతో చెప్పారు. అయితే ఆడవాళ్లు ఎక్కువగా ఏడవడానికి జీవశాస్త్రపరంగా ఒక కారణం ఉంది.

ఇదే అసలు కారణం:

మగాళ్ళలోనే కాకుండా ఆడవాళ్ళలో కూడా టెస్టోస్టెరోన్ ఉంటుంది. ఇది తక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఏడుపుని కంట్రోల్ చేస్తుంది. అయితే హార్మోన్ ప్రోలక్టిన్ అధిక స్థాయిలో ఉండడం వల్ల ఏడుపు రావడానికి కారణం అవుతుందట. ఈ కారణంగానే ఆడవాళ్లు ఎక్కువగా ఏడుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే ఆడవాళ్ళకి ఏడవాలన్న కోరిక ఉండదట. మరో కారణం ఏంటంటే.. ఆడవాళ్లు త్వరగా ఎమోషనల్ అయిపోవడం. ప్రపంచంలోని పేద దేశాలు, అగ్ర దేశాలు కలిపి మొత్తం 35 దేశాల్లో ఆడవాళ్ళ మీద పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనల్లో మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లే ఎక్కువగా ఏడుస్తున్నారని తేలింది. దీనికి కారణం ఆడవాళ్లు ఎక్కువగా ఎమోషనల్ అవ్వడమే అని పరిశోధకులు చెబుతున్నారు. ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నప్పటికీ మగాళ్లతో పోలిస్తే కొన్ని విషయాల్లో మానసికంగా కొంచెం వీక్ అని పరిశోధకులు చెబుతున్నారు. మరి మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లు ఎక్కువగా ఏడవడానికి మీకు తెలిసిన కారణాలు ఉంటే కామెంట్ చేయండి.

Show comments