రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు! పరీక్షకు హాజరైతే చాలు! ఇది లక్కీ ఛాన్స్!

RPF Recruitment 2024: రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ వివరాలు..

RPF Recruitment 2024: రైల్వే ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ 2024 నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆ వివరాలు..

ఈకాలంలో మంచి ఉద్యోగం అంటే గవర్నమెంట్ జాబే అని భావిస్తారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోట్లాది మంది యువత ఏళ్ల తరబడి చదువుతూ ఉంటారు. ఇంటికి దూరంగా ఉంటూ.. కనీసం కడుపు నిండా తినకుండా.. కండి నిండ నిద్ర పోకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారు. అయతే మరి ఇలా ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ వందలు, వేలల్లో ఉంటే.. వాటికి పోటీ పడే వారి సంఖ్య లక్షలు, కోట్లలో ఉంటుంది. ఇక మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే.

భారీ ఎత్తున్న ఉద్యోగాలు భర్తీ చేసే శాఖల్లో రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఒకటి. మీరు కూడా రైల్వే శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. ఇటీవల దాదాపు 14వేలకు పైగా పలు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానించిన రైల్వేశాఖ.. తాజాగా మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (ఆర్ఫఎఫ్), రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 4,660 ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. అర్హులైన, ఆసక్తికలిగిన అభ్యర్థులు ఈ లింక్‌పై క్లిక్‌ చేసి ఏప్రిల్‌ 15 నుంచి మే 14వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన సమాచారం..

  • మొత్తం పోస్టులు-4,660. వీటిలో 4,208 కానిస్టేబుల్‌, 452 ఎస్సై ఉద్యోగాలు ఉన్నాయి.
  • అర్హతలు: కానిస్టేబుల్ పోస్టులకు పదో తరగతి; ఎస్సై ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. అభ్యర్థులకు నిర్దిష్టమైన శారీరక ప్రమాణాలు అవసరం. 2024 జులై 1 నాటికి కానిస్టేబుల్ అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్లు, ఎస్సై అభ్యర్థులకు 20-28 ఏళ్ల మధ్య ఉండాలి. ఆయా వర్గాల వారీగా వయో సడలింపు ఇస్తారు.
  • ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ, ఫిజికల్ మెజర్‌మెంట్‌ తదితర పరీక్షల ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌/మహిళలు/ ట్రాన్స్‌జెండర్‌/ మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ.500. పరీక్షకు హాజరైతే రూ.400 రిఫండ్‌ చేస్తారు.
  • జీతం: ఎస్సై పోస్టులకు రూ.35,400, కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700 చొప్పున ప్రారంభ వేతనంగా ఇస్తారు.

రీజియన్ల వారీగా ఆయా రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు భర్తీ చేసే ఉద్యోగ ఖాళీల సంఖ్య, పరీక్ష తేదీలు, పరీక్ష కేంద్రాలు తదితర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Show comments