డిగ్రీ కూడా అవసరం లేదు! నెలకు 78 వేల జీతంతో గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్!

IOCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు రూ. 78 వేల జీతం అందుకోవచ్చు.

IOCL Recruitment 2024: మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఇదే మంచి సమయం. ప్రభుత్వ రంగ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. నెలకు రూ. 78 వేల జీతం అందుకోవచ్చు.

నేటి రోజుల్లో ఉద్యోగం సాధించడం కష్టతరమైపోతున్నది. ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా సరే లక్షలాది మంది నిరుద్యోగులు పోటీపడుతున్నారు. క్వాలిఫికేషన్ మాత్రమే ఉంటే చాలదు అనుబంధ కోర్సులు, స్కిల్స్ ను ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అలా అయితేనే గవర్నమెంట్ జాబ్ సొంతం చేసుకోవచ్చు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? డిగ్రీ కూడా అవసరం లేకుండానే ప్రభుత్వ కొలువును సాధించే అవకాశం వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.

ఐఓసీఎల్ నిరుద్యోగులకు శుభవార్తను అందించింది. 88 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18 నుంచి 26 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 78వేల వరకు జీతం అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న వారు ఆగస్టు 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం పోస్టులు – 88
  • ఇంజినీరింగ్ అసిస్టెంట్ – 38
  • టెక్నికల్ అటెండెంట్ – 29
  • జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ – 21

అర్హత:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు ఇంజినీరింగ్ డిప్లొమా, ఐటీఐ, బీఎస్సీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయస్సు 2024 జులై 31 నాటికి 18 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఆయా కేటగిరీవర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు :

  • జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు రూ.300 చెల్లించాలి. దివ్యాంగులు, ఎస్టీలు, ఎస్సీలకు దరఖాస్తు ఫీజు నుంచి మినహాయింపునిచ్చారు.

ఎంపిక ప్రక్రియ :

  • అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి, మెరిట్ సాధించిన వారిని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.

జీతం :

  • ఇంజినీరింగ్ అసిస్టెంట్, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,000 నుంచి రూ.1,05,000 వరకు జీతం ఉంటుంది. టెక్నికల్ అటెండెంట్ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.23,000 నుంచి రూ.78,000 జీతం ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభ తేదీ :

  • 22-07-2024

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :

  • 21-08-2024
Show comments