ఈ అర్హతలుంటే చాలు? ఈ పోస్టులకు వెంటనే అప్లై చేసుకోండి.. నెలకు 78,800 జీతం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 78 వేల వరకు జీతం అందుకోవచ్చు.

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 78 వేల వరకు జీతం అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు 78 వేల వరకు జీతం అందుకోవచ్చు. తాజాగా అటామిక్ ఎనర్జీ మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నైలోని కల్పక్కంలోనున్న ఇందిరాగాంధీ సెంటర్‌ ఫర్‌ అటామిక్‌ రిసెర్చ్‌ డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ప్రాతిపదికన పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. 91 సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. వయసు 25 నుంచి 50 ఏళ్లు కలిగి ఉండాలి. పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్ డ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు 30 జూన్ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు:

  • 91

విభాగాల వారీగా ఖాళీలు:

సైంటిఫిక్ ఆఫీసర్:

  • 34

టెక్నికల్ ఆఫీసర్:

  • 01

సైంటిఫిక్ అసిస్టెంట్:

  • 12

నర్స్-ఏ:

  • 27

ఫార్మసిస్ట్-బి:

  • 14

టెక్నీషియన్-బి:

  • 3

అర్హత:

  • సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంబీబీఎస్ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి అభ్యర్థులు 25 నుంచి 50 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • పోస్టులను అనుసరించి ప్రిలిమినరీ టెస్టు, అడ్వాన్స్ డ్ టెస్ట్, ఇంటర్య్వూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • పోస్టులను బట్టి 21 వేల నుంచి 78,800 జీతం అందుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

  • పోస్టులను అనుసరించి 100 నుంచి 300 వరకు చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 30-06-2024
Show comments