P Venkatesh
మీరు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? పోలీస్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా అయితే ఈ ఉద్యోగాలను వదలకండి. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
మీరు పదో తరగతి, ఇంటర్ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా? పోలీస్ జాబ్ సాధించడమే మీ లక్ష్యమా అయితే ఈ ఉద్యోగాలను వదలకండి. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.
P Venkatesh
యూత్ లో పోలీస్ జాబ్స్ కు ఉండే క్రేజే వేరు. పోలీస్ జాబ్స్ సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు యువత. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే పోలీస్ ఉద్యోగాల కోసం లక్షలాది మంది యువత పోటీపడుతుంటారు. పోలీస్ ఉద్యోగాలు సాధిస్తే మంచి జీతంతో పాటు సమాజానికి సేవ చేసే భాగ్యం దక్కుతుంది. సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. మరి మీకు కూడా పోలీస్ ఉద్యోగాలంటే ఇష్టమా? పోలీస్ జాబ్ సాధించడమే మీ కలనా? అయితే మీ కలను నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. మీరు టెన్త్, ఇంటర్ పాసై ఖాళీగా ఉన్నట్లైతే వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.
కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. ఎస్, కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 162 ఎస్‌ఐ,హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ గ్రూప్- బీ, సీ (నాన్ గెజిటెడ్) పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జులై 1వ తేదీ వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.