అప్లై చేశారా?.. 2,049 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. త్వరలో ముగియనున్న గడువు

నిరుద్యోగులకు అలర్ట్. 2049 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నిరుద్యోగులకు అలర్ట్. 2049 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలోనే దరఖాస్తు గడువు ముగియనున్నది. ఇప్పటి వరకు అప్లై చేసుకోని వారు ఆ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే చాలదు.. దానికి సరైన ప్రణాళిక డెడికేషన్ ఉండాలి. అప్పుడే మీరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. జాబ్ కొట్టేందుకు ఇదే సరైన సమయం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల పలు శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఏకంగా 2049 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. మరి ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? వయోపరిమితి ఎంత? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే నిరుద్యోగులకు భారీ శుభవార్త. ఇటీవల స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) వివిధ కేంద్రం ప్రభుత్వ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు గల వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 26లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు చేసుకోదలిచిన వారు పూర్తి సమాచారం కోసం ఎస్‌ఎస్‌సీ అధికారిక వెబ్ సైట్ https://ssc.gov.in/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం సెలక్షన్‌ పోస్టులు:

  • 2049

పోస్టుల వివరాలు:

  • లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్‌మ్యాన్, అకౌంటెంట్, అసిస్టెంట్ ప్లాంట్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోర్‌మాన్, జూనియర్ ఇంజినీర్, యూడీసీ, డ్రైవర్-కమ్ మెకానిక్, టెక్నికల్ అసిస్టెంట్, సూపర్‌వైజర్, సీనియర్ ట్రాన్స్‌లేటర్, స్టోర్ కీపర్ ఎంట్రీ ఆపరేటర్, రిసెర్చ్ ఇన్వెస్టిగేటర్, కోర్ట్ క్లర్క్, సీనియర్ జియోగ్రాఫర్, స్టాక్‌మ్యాన్ తదితర పోస్టులున్నాయి.

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులను అనుసరించి టెన్త్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టుని అనుసరించి 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలపాటు వయో సడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు:

  • అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • స్కిల్ టెస్ట్/ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/ డేటాఎంట్రీ టెస్ట్/ కంప్యూటర్ పరీక్ష ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 26-02-2024.

దరఖాస్తుకు చివరితేది:

  • 26-03-2024

సీబీటీ టెస్ట్:

  • 06 – 08 మే, 2024.
Show comments