డిగ్రీ, పీజీ పాసైతే చాలు.. ఈ బ్యాంక్ ఉద్యోగాలు మీ కోసమే.. త్వరగా అప్లై చేసుకోండి

మీరు బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలక ఎంపికైతే నెలకు రూ. 78 వేల వరకు జీతాన్ని అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు బ్యాంక్ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నారా? ప్రముఖ బ్యాంక్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలక ఎంపికైతే నెలకు రూ. 78 వేల వరకు జీతాన్ని అందుకోవచ్చు. వెంటనే అప్లై చేసుకోండి.

నిరుద్యోగులు తమ కలలను నెరవేర్చుకునే సమయం వచ్చింది. అహర్నిశలు కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావాహులకు ఇదే మంచి అవకాశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ ను విడుదల చేస్తున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. మరో వైపు పలు బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి. తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు కేవలం డిగ్రీ, పీజీ పాసైతే చాలు ఈ ఉద్యోగాలకు పోటీపడవచ్చు.

ఎస్బీఐ నుంచి ఎప్పటికప్పుడు జాబ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. తాజాగా మరో 50 క్రెడిట్‌ అనలిస్ట్‌ పోస్టుల భర్తీకి ముంబయిలోని ఎస్‌బీఐ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఫిబ్రవరి 13 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 4 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది. అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 78,230 జీతాన్ని అందుకోవచ్చు. దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ https://www.sbi.co.in/ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్య సమాచారం:

మొత్తం క్రెడిట్‌ అనలిస్ట్‌ (మిడిల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ 3) పోస్టులు:

  • 50

అర్హత:

  • డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్‌)/ పీజీడీబీఏ/ పీజీడీబీఎం/ ఎంఎంఎస్‌ (ఫైనాన్స్‌)/ సీఏ/ సీఎఫ్‌ఏ/ ఐసీడబ్ల్యూఏ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు 25 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు:

  • ఈ ఉద్యోగాలకు నెలకు రూ.63,840-78,230 జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.750 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:

  • అప్లికేషన్‌ షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

దరఖాస్తుల ప్రారంభ తేదీ:

  • 13-02-2024

దరఖాస్తులకు చివరి తేదీ:

  • 04-03-2024

ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌:

Show comments