వెస్ట్రన్ రైల్వేలో 5 వేల ఉద్యోగాలు.. రాత పరీక్ష లేదు.. మీరూ ట్రై చేయండి

RRC western Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్ట్రన్ రైల్వేలో 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ అర్హతలున్నవారు వెంటనే అప్లై చేసుకోండి.

RRC western Railway Recruitment 2024: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. వెస్ట్రన్ రైల్వేలో 5 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ అర్హతలున్నవారు వెంటనే అప్లై చేసుకోండి.

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. రాత పరీక్ష లేకుండానే జాబ్ కొట్టొచ్చు. ఇలాంటి ఛాన్స్ మళ్లీ రాదు. ఇటీవల రైల్వే డిపార్ట్ మెంట్ నుంచి భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. వేల సంఖ్యలో జాబ్స్ భర్తీ చేస్తున్నారు. తాజాగా వెస్ట్రన్ రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఏకంగా 5 వేల పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి వేతనం అందుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరంటే?

రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ వెస్ట్రన్ రైల్వే 2024-25 సంవత్సరానికి వెస్ట్రన్ రైల్వే పరిధిలోని డివిజన్/ వర్క్ షాప్ లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 5,066 ఖాళీలను భర్తీ చేయనున్నది. ఫిట్టర్, వెల్డర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, పీఎస్ఏఏ, ఎలక్ట్రీషియన్, వైర్ మ్యాన్, తదితర ట్రేడులలో ఈ జాబ్స్ ను భర్తీ చేయనున్నారు. ఒక సంవత్సరం ట్రైనింగ్ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి. 15-24 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 22 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం పోస్టులు: 5066

అర్హత:

  • అభ్యర్థులు టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 15-24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక ప్రక్రియ:

  • టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ. 100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 23-09-2024

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 22-10-2024
Show comments