UCO బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. త్వరగా అప్లై చేసుకోండి

యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. స్ఫెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. స్ఫెషలిస్టు ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

మీరు ఎప్పటి నుంచో బ్యాంకు ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్నారా? బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? అయితే మీలాంటి బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. ప్రముఖ యునైటెడ్ కమర్షియల్ బ్యాంకు పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. యూకో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 127 మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీచేయనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

కోల్‌కతాలోని యూకో బ్యాంకు, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. అభ్యర్థులు డిసెంబరు 27 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దరఖాస్తు చేసుకోదలచిన ఆశావాహులు పూర్తి సమాచారం కోసం యూకో బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://www.ucobank.com/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు

మొత్తం పోస్టులు:

  • 127

ఖాళీల వివరాలు:

  • అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (డిజిటల్ లెండింగ్) 01, చీఫ్ మేనేజర్ (ఫిన్‌టెక్ మేనేజ్‌మెంట్) 01, చీఫ్ మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్) 01, సీనియర్ మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ 02, మేనేజర్ నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేషన్ 08, సీనియర్ మేనేజర్ (డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్) 02, మేనేజర్ – డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ 03, సీనియర్ మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డిగ్) 01, మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డింగ్) 03, అసిస్టెంట్ మేనేజర్ (మర్చంట్ ఆన్‌బోర్డింగ్) 02, సీనియర్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ) 01, మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ) 03, అసిస్టెంట్ మేనేజర్ (ఇన్నోవేషన్ & ఎమర్జింగ్ టెక్నాలజీ) 02, సీనియర్ మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డెవలపర్) 02, మేనేజర్ (సాఫ్ట్‌వేర్ డెవలపర్) 13, మేనేజర్ (ఎంఐఎస్‌ & రిపోర్ట్ డెవలపర్) 06, మేనేజర్ (డేటా అనలిస్ట్) 04, మేనేజర్ (డేటా సైంటిస్ట్) 04, ఫైర్ ఆఫీసర్ 01, మేనేజర్ (ఎకనమిస్ట్) 04, మేనేజర్ (లా) 13, మేనేజర్ (క్రెడిట్) 50 పోస్టులు ఉన్నాయి.

విద్యార్హత:

  • పోస్టును అనుసరించి సీఏ/సీఎంఏ, డిగ్రీ, పీజీ, పీజీడీఎం/పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థులు 25 సంవత్సరాల నుంచి 35 ఏళ్ల లోపు వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

  • జనరల్, ఈడబ్య్లఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.800 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు విధానం:

  • ఆఫ్‌ లైన్

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ:

  • 05-12-2023

దరఖాస్తుకు చివరితేది:

  • 27-12-2023.

దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:

General Manager,
UCO Bank, Head Office, 4th Floor, H. R. M Department,
10, BTM Sarani, Kolkata, West Bengal – 700 001.

యూకో బ్యాంక్ అధికారిక వెబ్ సైట్:

https://www.ucobank.com/

Show comments