ONGC Apprentice Recruitment 2024: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 2,236 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. మంచి జీతం

ONGC Apprentice Recruitment 2024: జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 2236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ONGC Apprentice Recruitment 2024: జాబ్ సెర్చ్ లో ఉన్నారా? అయితే మీకు ఇదే మంచి ఛాన్స్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో 2236 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ఇటీవల కేద్రప్రభుత్వ సంస్థల నుంచి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. రైల్వే డిపార్ట్ మెంట్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ నుంచి వేల సంఖ్యలో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఇదే మంచి అవకాశం. మీరు కన్న కలల్ని నిజం చేసుకునే ఛాన్స్ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే పోటీ పరీక్షలు రాయాలి. అసాధారణ ప్రతిభ చూపించాలి. ఆ తర్వాత కొన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇన్ని దశలను దాటితే తప్పా ప్రభుత్వ ఉద్యోగం వరించదు. ఇప్పుడు మీకు రాత పరీక్షరాయకుండానే జాబ్ కొట్టే అవకాశం వచ్చింది. అది కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలో. ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. మరి ఈ ఉద్యోగాలకు అర్హులు ఎవరు? వయోపరిమితి ఎంత? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

కేంద్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఓఎన్ జీసీ సెక్టార్లలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 2, 236 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, సివిల్ ఎగ్జీక్యూటీవ్, పెట్రోలియం ఎగ్జీక్యూటివ్, ఆఫీస్ అసిస్టెంట్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్ మెకానిక్, స్టోర్ కీపర్, మెషినిస్ట్, సర్వేయర్, వెల్డర్, ఫైర్ సేఫ్టీ టెక్నీషియన్ ట్రేడుల్లో ఉద్యోగాలు భర్తీకానున్నాయి.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోదలిచిన అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఈ, బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18-24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయోసడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు విద్యార్హతల్లో సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు 9 వేలు, డిప్లొమా అప్రెంటిస్ కు 8 వేల 50 రూపాయలు, ట్రేడ్ అప్రెంటిస్ కు 7 వేల నుంచి 8 వేల 50 రూపాయల జీతం చెల్లిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 25 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ongcindia.com వెబ్ సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.

Show comments