Mounika got 4 Government jobs: ట్యూషన్స్ చెబుతూ పేదింటి బిడ్డ సాధించిన విజయం! అందరికీ ఆదర్శం!

ట్యూషన్స్ చెబుతూ పేదింటి బిడ్డ సాధించిన విజయం! అందరికీ ఆదర్శం!

Mounika got 4 Government jobs: పేదింటి బిడ్డ ప్రతిభకు ఫలితం దక్కింది. ట్యూషన్స్ చెబుతూనే పోటీపరీక్షలకు సన్నద్ధమై ఒకటి కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

Mounika got 4 Government jobs: పేదింటి బిడ్డ ప్రతిభకు ఫలితం దక్కింది. ట్యూషన్స్ చెబుతూనే పోటీపరీక్షలకు సన్నద్ధమై ఒకటి కాదు ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలుస్తోంది.

సంకల్పబలముంటే సాధించలేనిది ఏది లేదని నిరూపిస్తున్నారు నేటి యువత. కన్న వారు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని, కలల్ని నిజం చేస్తున్నారు. ముందు నుంచే ఓ లక్ష్యాన్ని ఏర్పర్చుకుని అలుపెరుగని పోరాటం చేస్తూ ఉన్నత స్థాయికి చేరుకుంటున్నారు. చదువు పూర్తవకుండానే లక్షల ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందుతున్నారు. ఈ క్రమంలో మరో పేదింటి బిడ్డ ప్రతిభకు సరైన ఫలితం దక్కింది. ప్రస్తుత రోజుల్లో గవర్నమెంట్ జాబ్స్ కు ఫుల్ కాంపిటీషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలుస్తోంది ఆ యువతి. ఆమె మరెవరో కాదు సూర్యాపేట జిల్లాకు చెందిన భూక్య మౌనిక.

సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం పాతడోనబండ తండాకు చెందిన భూక్య మౌనిక 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించింది. పేద కుటుంబానికి చెందిన ఆమె హైదరాబాద్ లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ఉంటూ.. స్థానిక పిల్లలకు ట్యూషన్‌లు చెప్పుకూంటూ సొంతంగా ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమైంది. ఈక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్-4 జాబ్స్ కు ఎలాంటి కోచింగ్ లేకుండా 6వ ర్యాంక్, టీజీపీఎస్సీ ఫలితాల్లో పంచాయతీరాజ్ ఏఈఈ, 2023లో రైల్వేలో క్యారేజ్ మరియు వ్యాగన్, లెవెల్-3లో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ ఉద్యోగాలు సాధించింది. పేదింటి బిడ్డ 4 ఉద్యోగాలు సాధించడం పట్ల ఆమెపై అభినందనల వర్షం కురుస్తోంది. కుటుంబ సభ్యుల్లో ఆనందానికి హద్దే లేకుండా పోయింది.

Show comments